(1 / 5)
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి రికార్డుల వేటలో సాగుతూనే ఉన్నాడు. తాజాగా వన్డేల్లో 14 వేల పరుగుల మైలురాయి చేరుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ తో మ్యాచ్ లో ఈ ఫీట్ సాధించాడు.
(AP)(2 / 5)
అంతర్జాతీయ క్రికెట్లో వన్డేల్లో 14 వేల పరుగుల రికార్డు అందుకున్న మూడో ఆటగాడు కోహ్లి. సచిన్ టెండూల్కర్ (18,426), కుమార సంగక్కర (14,234) మాత్రమే కోహ్లి కంటే ముందున్నారు. ప్రస్తుతం ఆడుతున్న క్రికెటర్లలో కోహ్లి దరిదాపుల్లో ఎవరూ లేరు.
(AP)(3 / 5)
వన్డేల్లో అత్యంత వేగంగా 14 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా కోహ్లి హిస్టరీ క్రియేట్ చేశాడు. అతను 287వ ఇన్నింగ్స్ లో ఈ ఫీట్ అందుకున్నాడు. లెజెండ్ సచిన్ (350 ఇన్నింగ్స్) రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. సంగక్కర 378 ఇన్నింగ్స్ లో ఈ ఘనత అందుకున్నాడు.
(AFP)(4 / 5)
పాకిస్థాన్ తో మ్యాచ్ లోనే కోహ్లి మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అత్యధిక క్యాచ్ లు అందుకున్న భారత ఫీల్డర్ గా నిలిచాడు. కోహ్లి 158 క్యాచ్ లు అందుకున్నాడు. ఓవరాల్ గా అతను జయవర్ధనె (218), పాంటింగ్ (160) తర్వాతి స్థానంలో ఉన్నాడు.
(AFP)ఇతర గ్యాలరీలు