Virat Kohli Milestone: విరాట్ కోహ్లి టెస్టుల్లో మరో రికార్డు.. ఈ ఘనత సాధించిన నాలుగో ఇండియన్ ప్లేయర్
- Virat Kohli Milestone: విరాట్ కోహ్లి టెస్టుల్లో మరో మైలురాయి అందుకున్నాడు. న్యూజిలాండ్ తో బెంగళూరులో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా అతడు మరో రికార్డు క్రియేట్ చేశాడు.
- Virat Kohli Milestone: విరాట్ కోహ్లి టెస్టుల్లో మరో మైలురాయి అందుకున్నాడు. న్యూజిలాండ్ తో బెంగళూరులో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా అతడు మరో రికార్డు క్రియేట్ చేశాడు.
(1 / 5)
Virat Kohli Milestone: న్యూజిలాండ్ తో జరుగుతున్న బెంగళూరు టెస్టు రెండో ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ రకంగా టెస్టు క్రికెట్ చరిత్రలో గొప్ప వ్యక్తిగత రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో ఈ ఘనత సాధించిన నాలుగో ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు.
(2 / 5)
Virat Kohli Milestone: టెస్టు క్రికెట్ లో విరాట్ కోహ్లి 9 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. న్యూజిలాండ్ తో తొలి టెస్టుకు ముందు అతనికి ఈ మైల్ స్టోన్ దాటడానికి 53 పరుగులు అవసరం అయ్యాయి. తొలి ఇన్నింగ్స్ లో డకౌటైనా.. రెండో ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఆ ఘనత అందుకున్నాడు.
(3 / 5)
Virat Kohli Milestone: విరాట్ కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్ (15921), రాహుల్ ద్రవిడ్ (13265), సునీల్ గవాస్కర్ (10122) మాత్రమే టెస్టుల్లో 9000 పరుగుల మైలురాయిని దాటారు. భారతీయుల్లో అత్యధిక టెస్టు పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ జాబితాలో కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు.
(4 / 5)
Virat Kohli Milestone: బెంగళూరు టెస్టు రెండో ఇన్నింగ్స్ లో మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన విరాట్.. 70 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇక 53 పరుగుల దగ్గర టెస్టుల్లో 9 వేల రన్స్ మైలురాయి అందుకున్నాడు. మొత్తంగా ఈ ఘనత సాధించిన 18వ క్రికెటర్ అతడు.
ఇతర గ్యాలరీలు