Virat Kohli: రెండో వన్డేకు కోహ్లీ రెడీ.. మరి ఎవరిని తప్పిస్తారు!
- Virat Kohli: ఇంగ్లండ్‍తో రెండో వన్డేకు భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రెడీ అయ్యాడు. దీంతో తుదిజట్టులో మార్పు తథ్యంగా మారనుంది.
- Virat Kohli: ఇంగ్లండ్‍తో రెండో వన్డేకు భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రెడీ అయ్యాడు. దీంతో తుదిజట్టులో మార్పు తథ్యంగా మారనుంది.
(1 / 5)
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్‍తో తొలి వన్డేకు దూరమయ్యాడు. మోకాలి గాయం కారణంగా మ్యాచ్ ఆడలేకపోయాడు. ఈ వన్డేలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. మూడు వన్డేల సిరీస్‍లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తదుపరి రెండో వన్డే కటక్ వేదికగా ఆదివారం (ఫిబ్రవరి 9) జరగనుంది.
(HT_PRINT)(2 / 5)
విరాట్ కోహ్లీ ఇప్పుడు పూర్తిగా ఫిట్ అయ్యాడని సమాచారం వెల్లడైంది. రెండో వన్డేకు అతడు పూర్తిగా సిద్ధమయ్యాడని తెలుస్తోంది. దీంతో ఈ మ్యాచ్‍లో కోహ్లీ ఆడడం ఖాయంగా ఉంది.
(AP)(3 / 5)
కోహ్లీ గాయంతో ఆడకపోవటంతో తనకు తొలి వన్డే తుది జట్టులో చోటు దక్కిందని స్వయంగా శ్రేయస్ అయ్యర్ చెప్పాడు. ఈ మ్యాచ్‍లో శ్రేయస్ 36 బంతుల్లోనే 56 పరుగులతో మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో కోహ్లీ వచ్చినా.. రెండో వన్డేలో శ్రేయస్‍ను తప్పించే ఛాన్స్ లేదు.
(PTI)(4 / 5)
రెండో వన్డే కోసం తుదిజట్టులో యశస్వి జైస్వాల్‍ను తప్పించి విరాట్ కోహ్లీని భారత్ తీసుకునే ఛాన్స్ ఉంది. అదే జరిగితే శుభ్‍మన్ గిల్ మళ్లీ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్‍కు రానున్నాడు. కోహ్లీ మూడో ప్లేస్‍లో బ్యాటింగ్‍కు దిగే అవకాశం ఉంటుంది.
(Surjeet Yadav)ఇతర గ్యాలరీలు