Virat Kohli : 2011 డొమినికా టెస్టును గుర్తు చేసుకున్న కోహ్లీ.. ఎమోషనల్ పోస్ట్
- IND Vs WI Dominica Test : వెస్టిండీస్, టీమ్ ఇండియాల మధ్య జూలై 12 బుధవారం నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ డొమినికాలో జరగనుంది. అయితే 2011లో డొమినికాలో వెస్టిండీస్‌తో భారత్ చివరి టెస్టు మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్, విరాట్ కలిసి ఆడారు.

(1 / 6)
జూలై 12 నుంచి వెస్టిండీస్‌తో భారత్ తొలి టెస్టు మ్యాచ్ ఆడనుంది. తొలి మ్యాచ్ డొమినికాలో జరగనుంది. ఈ టెస్టు ప్రారంభానికి ముందు విరాట్ కోహ్లి కోచ్ ద్రవిడ్‌తో ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు(photos- virat kohli instagram)
(2 / 6)
ఈ ఫోటోకు కోహ్లీ ఎమోషనల్ క్యాప్షన్ రాశాడు. 2011 డొమినికా టెస్టులో ద్రవిడ్, నేను కలిసి ఆడామని గుర్తు చేసుకున్నాడు.
(3 / 6)
ఈ ఫోటోకు కోహ్లీ ఎమోషనల్ క్యాప్షన్ రాశాడు. 2011 డొమినికా టెస్టులో ద్రవిడ్, నేను కలిసి ఆడామని గుర్తు చేసుకున్నాడు.
(4 / 6)
ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 204 పరుగులకు ఆలౌటైంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 347 పరుగులు చేసింది. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 322 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 3 వికెట్లకు 94 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.
(5 / 6)
మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది. ఈ పర్యటనలో, విరాట్ కోహ్లీ కింగ్‌స్టన్‌లోని సబీనా పార్క్‌లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 12 ఏళ్ల తర్వాత డొమినికా వేదికగా విరాట్ టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు.
(6 / 6)
వెస్టిండీస్ చివరిసారిగా 2002లో భారత్‌పై టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 8 టెస్టు సిరీస్‌లు జరగగా, ప్రతిసారీ టీమ్‌ఇండియా విజయం సాధించింది. భారత్, వెస్టిండీస్ జట్లు ఇప్పటి వరకు మొత్తం 98 టెస్టు మ్యాచ్‌లు ఆడగా, అందులో టీమ్ ఇండియా 22, వెస్టిండీస్ 30 మ్యాచ్‌లు గెలిచాయి. ఈ సిరీస్‌లో రెండో మ్యాచ్ ఇరు జట్ల మధ్య 100వ టెస్టు మ్యాచ్ కానుంది.
ఇతర గ్యాలరీలు