Virat Kohli: కెప్టెన్సీ ఇస్తామంటే వద్దన్న విరాట్ కోహ్లీ! వివరాలివే
- Virat Kohli: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సుమారు 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ ఆడనున్నాడు. ఢిల్లీ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఆ వివరాలు ఇవే..
- Virat Kohli: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సుమారు 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ ఆడనున్నాడు. ఢిల్లీ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఆ వివరాలు ఇవే..
(1 / 5)
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దాదాపు మూడేళ్లుగా టెస్టుల్లో సరైన ఫామ్‍లో లేడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో గత రెండు టెస్టు సిరీస్‍ల్లో తీవ్రంగా విఫలమయ్యాడు. ఈ తరుణంలో దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ ఆడేందుకు రెడీ అయ్యాడు. సుమారు 13ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్‍లో బరిలోకి దిగనున్నాడు.
(PTI)(2 / 5)
రంజీ ట్రోఫీలో తన ఢిల్లీ తరఫున విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. రైల్వేస్‍తో జనవరి 30న మొదలుకానున్న చివరి గ్రూప్ మ్యాచ్‍లో ఢిల్లీ తరఫున ఆడనున్నాడు. ఇందుకోసం ఢిల్లీ జట్టుతో కోహ్లీ కలిశాడు. ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశాడు.
(PTI)(3 / 5)
విరాట్ కోహ్లీ రావడంతో అతడికి గౌరవంగా కెప్టెన్సీ ఇచ్చేందుకు ఢిల్లీ మేనేజ్‍మెంట్ నిర్ణయించింది. ఈ మ్యాచ్‍లో కెప్టెన్సీ చేయాలని కోహ్లీని అడిగిందట. అయితే, కెప్టెన్సీ ఆఫర్‌ను కోహ్లీ తిరస్కరించాడని సమాచారం బయటికి వచ్చింది.
(PTI)(4 / 5)
రైల్వేస్‍తో మ్యాచ్‍లో తాను ఢిల్లీకి సారథ్యం వహించనని, ఆటగాడిగానే బరిలోకి దిగుతానని కోహ్లీ అన్నాడట. ఆయుష్ బదోనీ సారథ్యంలో ఈ మ్యాచ్‍ను కోహ్లీ ఆడనున్నాడు.
(PTI)ఇతర గ్యాలరీలు