Virat Kohli Birthday: హ్యాపీ బర్త్ డే విరాట్ కోహ్లి.. రికార్డుల సంగతి సరే.. అతని ఒంటిపై ఉన్న ఈ టాటూలకు అర్థమేంటో తెలుసా?
- Virat Kohli Birthday: హ్యాపీ బర్త్ డే విరాట్ కోహ్లి. కింగ్ కోహ్లి ఆదివారం (నవంబర్ 5) తన 35వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అందరికీ తెలిసిన అతని రికార్డుల సంగతి పక్కన పెడితే.. అతని ఒంటిపై డజనుకుపైగా ఉన్న ఈ టాటూలకు అర్థమేంటో తెలుసా?
- Virat Kohli Birthday: హ్యాపీ బర్త్ డే విరాట్ కోహ్లి. కింగ్ కోహ్లి ఆదివారం (నవంబర్ 5) తన 35వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అందరికీ తెలిసిన అతని రికార్డుల సంగతి పక్కన పెడితే.. అతని ఒంటిపై డజనుకుపైగా ఉన్న ఈ టాటూలకు అర్థమేంటో తెలుసా?
(1 / 11)
Virat Kohli Birthday: విరాట్ కోహ్లి ఆదివారం (నవంబర్ 5) తన 35వ పుట్టిన రోజు జరుపుకుంటున్న వేళ.. తనకెంతో ఇష్టమైన టాటూల గురించి తెలుసుకుందాం. టాటూలంటే చాలా ఇష్టపడే కోహ్లి శరీరమంతా ఏదో ఒక టాటూ కనిపిస్తుంది. అయితే వాటి ప్రత్యేకతల గురించి మాత్రం చాలా మందికి తెలియదు.
(2 / 11)
Virat Kohli Birthday: ఐ ఆఫ్ గాడ్ అని కోహ్లి పిలుచుకునే టాటూ ఇది. అతని భుజంపై ఉంటుంది. దేవుడి కన్ను.. అన్నీ చూస్తుందని అర్థం. కోహ్లికి ఎంతో ఇష్టమైన టాటూ ఇది.
(3 / 11)
Virat Kohli Birthday: కోహ్లి ఒంటిపై జపనీస్ సమురాయ్ టాటూ కూడా ఉంటుంది. సమురాయ్ జపాన్ పోరాట యోధుడు. జీవితంలో విధేయత, క్రమశిక్షణ, నైతిక ప్రవర్తనలాంటి వాటిని సూచిస్తుంది. ఇందులోని కత్తి తనకు బలాన్ని, క్రమశిక్షణ ఇస్తుందని విరాట్ గతంలో చెప్పాడు.
(4 / 11)
Virat Kohli Birthday: విరాట్ ఒంటిపై ఉన్న 175 నంబర్ టాటూ. ఇది కోహ్లి క్యాప్ నంబర్ కావడం విశేషం.
(5 / 11)
Virat Kohli Birthday: కోహ్లి ఒంటిపై 269 నంబర్ కూడా ఉంటుంది. ఇది విరాట్ టెస్ట్ క్యాప్ నంబర్. ఇండియన్ టీమ్ చార్ట్ లో ఎప్పటికీ ఈ నంబర్ల ముందు తన పేరు ఉంటుంది కాబట్టి.. ఒంటిపై వీటిని టాటూలుగా వేయించుకున్నట్లు అతడు తెలిపాడు.
(6 / 11)
Virat Kohli Birthday: విరాట్ కోహ్లి ఎడమ చేతిపై ఉన్న సరోజ్ అనే పేరు గల టాటూ. తన తల్లి సరోజ్ పేరును కూడా కోహ్లి ఇలా టాటూగా వేయించుకోవడం విశేషం.
(7 / 11)
Virat Kohli Birthday: కోహ్లి తన మరో చేతిపై తండ్రి పేరు ప్రేమ్ అనే హిందీ అక్షరాలను కూడా పచ్చబొట్టుగా వేయించుకున్నాడు.
(8 / 11)
Virat Kohli Birthday: పరమ శివుడి భక్తుడు అయిన కోహ్లి ఎడమ చేతిపై మానస సరోవరంలోని కైలాస పర్వతంపై శివుడు ధ్యానం చేస్తున్నట్లుగా ఉండే టాటూ కూడా ఉంటుంది.
(9 / 11)
Virat Kohli Birthday: విరాట్ కోహ్లి రాశి అయిన స్కార్పియో (వృశ్చికం)ను కూడా టాటూగా వేసుకోవడం విశేషం.
(10 / 11)
Virat Kohli Birthday: గిరిజనుల కళను కూడా కోహ్లి తన శరీరంపై టాటూగా వేయించుకున్నాడు. ఇది దూకుడును సూచించే టాటూ.
ఇతర గ్యాలరీలు