తెలుగు న్యూస్ / ఫోటో /
Virat Kohli 100 T20 Fifty: హిస్టరీ క్రియేట్ చేసిన విరాట్.. ఫస్ట్ ఇండియన్ బ్యాటర్.. టాప్ లో వార్నర్.. ఓ లుక్కేయండి
- Virat Kohli 100 T20 Fifty: ఐపీఎల్ 2025లో సూపర్ ఫామ్ లో ఉన్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన ఫస్ట్ ఇండియన్ బ్యాటర్ గా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఆ రికార్డు ఏంటో చూసేయండి.

(1 / 5)
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి హిస్టరీ క్రియేట్ చేశాడు. టీ20ల్లో 100 హాఫ్ సెంచరీలు చేసిన ఫస్ట్ ఇండియన్ బ్యాటర్ గా నిలిచాడు. ఐపీఎల్ లో రాజస్థాన్ తో మ్యాచ్ లో కోహ్లి ఈ ఫీట్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్, డొమెస్టిక్ కలిసి 388వ ఇన్నింగ్స్ లో కోహ్లి ఈ రికార్డు అందుకున్నాడు.
(Surjeet Yadav)(2 / 5)
టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీల ప్రపంచ రికార్డు డేవిడ్ వార్నర్ పేరు మీద ఉంది. ఆ ఆసీస్ లెెజెండ్ 399 టీ20 ఇన్నింగ్స్ లో 108 ఫిఫ్టీలు చేశాడు.
(x/IPL)(3 / 5)
పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం 300 టీ20 ఇన్నింగ్స్ లో 90 హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ లిస్ట్ లో అతనిది మూడో స్థానం.
(AFP)(4 / 5)
విండీస్ విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్ కూడా టీ20ల్లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్లలో గేల్ (88) నాలుగో స్థానంలో ఉన్నాడు.
(PTI)ఇతర గ్యాలరీలు