Sea Plane Services: రేపు విజయవాడ టూ శ్రీశైలం సీ ప్లేన్ ట్రయల్ రన్‌…దేశంలో నాలుగు నగరాల్లో సర్వీసులు-vijayawada to srisailam sea plane trial run tomorrow services in four cities in the country ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sea Plane Services: రేపు విజయవాడ టూ శ్రీశైలం సీ ప్లేన్ ట్రయల్ రన్‌…దేశంలో నాలుగు నగరాల్లో సర్వీసులు

Sea Plane Services: రేపు విజయవాడ టూ శ్రీశైలం సీ ప్లేన్ ట్రయల్ రన్‌…దేశంలో నాలుగు నగరాల్లో సర్వీసులు

Nov 06, 2024, 09:05 AM IST Bolleddu Sarath Chandra
Nov 06, 2024, 09:05 AM , IST

  • Sea Plane Services:  దేశంలో తొలి సీప్లేన్ సర్వీసులకు విజయవాడ నగరం వేదిక కానుంది. కెనడాకు చెందిన డీ హావిలాండ్‌ ట్విన్ అట్టర్ క్లాసిక్‌ 300 విమానం భారత్‌కు చేరుకుంది. విజయవాడ, మైసూరు, లక్షద్వీప్‌, షిల్లాంగ్‌లలో ట్రయల్‌ రన్ నిర్వహిస్తారు. విజయవాడ నుంచి చంద్రబాబు శ్రీశైలం వరకు విమానంలో ప్రయాణిస్తారు. 

దేశీయ విమానయాన సంస్థల్లో రెండు మూడు సంస్థలు కెనడాకు చెందిన డి హావిలాండ్‌ ఎయిర్ క్రాఫ్ట్‌ సంస్థతో చర్చలు జరుపుతున్నాయి. లీజు ప్రాతిపదికన  విమానాలను దేశీయంగా నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. రెండు మూడు నెలల్లో ఈ ప్రయత్నాలు కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

(1 / 8)

అహ్మదాబాద్‌ నుంచి విజయవాడ వచ్చే సీ ఎయిర్‌ క్రాఫ్ట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు, విమాన యాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు లాంఛనంగా ప్రారంభిస్తారు. తొలి ట్రయల్ సర్వీసును శ్రీశైలం వరకు నిర్వహిస్తారు. డిహెచ్‌సి 6 ట్విన్ అట్టర్ క్లాసిక్ 300 సేవల్ని దేశంలో లాంఛనంగా ప్రారంభిస్తారు. 

(2 / 8)

దేశంలో నాలుగేళ్ల క్రితమే గుజరాత్‌లో సీ ప్లేన్ సర్వీసుల్ని ప్రారంభించారు. గుజరాత్‌లోని నర్మదా జిల్లాలోని కేవడియా ప్రాంతంలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ నుంచి సబర్మతీ రివర్ ఫ్రంట్ ప్రాంతానికి ఈ సర్వీసులు నడిపారు. అయితే ఎక్కువ కాలం ఈ సర్వీసులు నడపలేకపోయారు. పూర్తి స్థాయి సన్నాహాలతో రెండోసారి సేవల్ని ప్రారంబించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

(3 / 8)

డిహెచ్‌సి క్లాసిక్ 300 ఎయిర్‌ క్రాఫ్ట్‌ అహ్మదాబాద్‌ నుంచి దేశంలో సీ ప్లేన్ సర్వీసులు ప్రారంభించే నగరాల్లో పర్యటిస్తుంది. మొదట విజయవాడలో ల్యాండ్ అవుతుంది.  అక్కడి నుంచి మైసూర్, లక్షద్వీప్‌లకు ప్రయాణిస్తుంది. ఆ తర్వాత షిల్లాంగ్‌ వెళుతుంది. 

(4 / 8)

సీ ప్లేన్ల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన కెనడాకు చెందిన డి హావిలాండ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్ సంస్థ తయారు చేసిన డిహెచ్‌సి - 6 ట్విన్ అట్టర్‌ క్లాసిక్ 300 రకం విమానం బుధవారం భారత్‌ చేరుకుంటుంది. దేశంలోని అహ్మదాబాద్‌ నుంచి ఈ విమానం యాత్ర ప్రారంభమవుతుంది. 

(5 / 8)

రెగ్యులర్ సీ ప్లేన్ సర్వీసులు మరో రెండు మూడు నెలల్లో ప్రారంభం కానున్నాయి.  లక్ష ద్వీప్‌  నుంచి ఈ తరహా సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని సివిల్ ఏవియేషన్ వర్గాలు చెబుతున్నాయి. 

(6 / 8)

దేశీయ పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా సీ ప్లేన్ సర్వీసుల్ని ప్రారంభించాలని ఎన్డీఏ 3 ప్రభుత్వం నిర్ణయించింది. పదేళ్ల క్రితమే ఈ ప్రతిపాదనలు చేసినా అవి రకరకాల కారణాలతో మరుగున పడిపోయాయి. కేంద్ర పౌరవిమానయాన శాఖ బాధ్యతలు రామ్మోహన్ నాయుడు చేపట్టిన తర్వాత అందులో కదలిక వచ్చింది. దీంతో విజయవాడ నుంచి కూడా సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయించారు. 

(7 / 8)

దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు  ఫ్లైట్ కనెక్టివిటీ పెంపొందించేందుకు  సీ ప్లేన్‌లు అందుబాటులోకి రానున్నాయి. రానున్న రెండు మూడు నెలల్లో దేశ వ్యాప్తంగా రెగ్యులర్‌ సర్వీసులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నవంబర్‌ 9వ తేదీన విజయవాడ నుంచి శ్రీశైలంకు సీ ప్లేన్ ట్రయల్ రన్ జరుగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఇందులో ప్రయాణిస్తారు. దేశంలోని పలు నగరాల్లో సీ ప్లేన్ సర్వీసుల్ని నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు