Janasena : జనసేన ప్రెస్ మీట్ లో సీఎం జగన్ కటౌట్, భీమిలి సభకు కౌంటర్
- Janasena : భీమిలి సభలో వైసీపీ పైశాచికానందం కోసం చేసిన పోకడలను ఖండిస్తున్నామని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఒక్క విలేకరుల సమావేశం పెట్టని సీఎం జగన్ దేనికి సిద్ధమని ప్రశ్నించారు. విజయవాడలో జనసేన విలేకరుల సమావేశంలో సీఎం జగన్ కటౌట్ పెట్టారు.

(1 / 6)
వైసీపీ ప్రభుత్వ లెక్కల్లో తప్పులపై చర్చించేందుకు మేము "సిద్ధం" మీరు సిద్ధమా? దమ్ముంటే చర్చకు రావాలని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సవాల్ చేశారు.
(2 / 6)
సీఎం జగన్ కి ప్రెస్ మీట్ పెట్టడం చేతకాదని, మీడియాతో మాట్లాడే ధైర్యం లేదు కాబట్టి, జనసేన తరపున మేమే ప్రెస్ మీట్ లో కూర్చోబెట్టామని నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు.
(3 / 6)
కొత్త అప్పుల కోసం రివర్స్ బారోయింగ్ అంటూ వైసీపీ వింత పదం తెచ్చిందని, రివర్స్ బారోయింగ్ ద్వారా తెచ్చిన రూ. 91,253.29 కోట్లు ఎక్కడికి వెళ్లాయో అంతుబట్టడం లేదని నాదెండ్ల ఆరోపించారు.
(4 / 6)
రివర్స్ బారోయింగ్ అప్పుల సొమ్ము ఎటు పోయిందో సీఎం జగన్ కే తెలుసని నాదెండ్ల మనోహర్ అన్నారు. బడ్జెట్ లో లెక్క చూపాల్సిన సమయంలో అధికారుల్లో ఆందోళన నెలకొందన్నారు.
(5 / 6)
విదేశీ బ్యాంకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్టులో పెట్టాయని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
ఇతర గ్యాలరీలు