
(1 / 6)
మచిలీపట్నం లోక్ సభ స్థానానికి అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిని(Vallabhaneni Balashowry) జనసేన ఖరారు చేసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా అవనిగడ్డ, పాలకొండ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.

(2 / 6)
వల్లభనేని బాలశౌరి గత ఎన్నికల్లో వైసీపీ తరఫున మచిలీపట్నం ఎంపీగా గెలిచారు. అయితే వైసీపీ ఆయన సీటు కేటాయించలేదు. దీంతో ఆయన వైసీపీకి రాజీనామా చేసిన జనసేనలో చేరారు.

(3 / 6)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలి విడత ఎన్నికల ప్రచారం నేటి నుంచి ప్రారంభం కానుంది. తాను పోటీ చేస్తున్న పిఠాపురం(Pithapuram) స్థానం నుంచి ఎన్నికల ప్రచారానికి పవన్ శ్రీకారం చుట్టునున్నారు.

(4 / 6)
ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan)...పిఠాపురం చేరుకున్నారు. ఆయనకు జనసేన, టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

(5 / 6)
పవన్ కల్యాణ్ దొంతమూరు గ్రామంలోని పిఠాపురం టీడీపీ ఇన్ ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే వర్మ నివాసానికి వెళ్లి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు.

(6 / 6)
తొలి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 2 వరకు పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు చేబ్రోలు రామాలయం సెంటర్ వద్ద వారాహి విజయ భేరి బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు.
ఇతర గ్యాలరీలు