Vijayawada Police Drones : పేకాట రాయుళ్ల పనిపట్టిన డ్రోన్లు, విజయవాడ సిటీ పోలీసుల వినూత్న నిఘా
Vijayawada Police Drones : విజయవాడ పోలీసులు అసాంఘిక కార్యకలాపాలను డ్రోన్ల సాయంతో అడ్డుకట్టవేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం, గంజాయి సేవించే వ్యక్తులు, స్కూల్స్ , కాలేజీల వద్ద ఈవ్ టీజింగ్ చేసే వారిని డ్రోన్ల సాయంతో గుర్తిస్తున్నారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణకు డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు.
(1 / 6)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతికత వినియోగంతో పాలనను కొత్త పుంతలు తొక్కిస్తుంది. విజయవాడ వరదల సమయంలో డ్రోన్స్ వినియోగం, తాజాగా వాట్సాప్ గవర్నెన్స్ తో పాలనలో సాంకేతికతకు పెద్ద పీట వేస్తుంది. ఇటీవల అమరావతిలో డ్రోన్ సమ్మిట్ కూడా నిర్విహించిన విషయం తెలిసిందే. డ్రోన్ల సహాయంతో నేరాలను అరికట్టడంలో పోలీసులు సైతం దృష్టి పెట్టారు.
(2 / 6)
విశాఖ మన్యంలో గంజాయి సాగును గుర్తించి, నిర్మూలించేందుకు పోలీసులు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టి గంజాయి సాగును అడ్డుకుంటున్నారు. తాజాగా విజయవాడ సిటీ పోలీసులు డ్రోన్ కెమెరాలతో నేరాలకు అడ్డుకట్ట వేస్తున్నారు.
(3 / 6)
ఆధునిక సాంకేతికతతో నేరాలను కట్టడి చేయాలనే ఉద్దేశంతో విజయవాడ కమిషనరేట్ కు ప్రభుత్వం డ్రోన్స్ అందించింది. వీటితో బహిరంగ ప్రదేశాల్లో మద్యం, గంజాయి సేవించే వ్యక్తులను, పాఠశాలలు, కాలేజీ వద్ద ఈవ్ టీజింగ్ చేసే వారిని గుర్తించి, వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. అలాగే పేకాట, కోడి పందేలు వంటి అసాంఘిక కార్యక్రమాలను అడ్డుకునేందుకు పోలీసులకు అవకాశం దొరికింది.
(4 / 6)
ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసులు ఆధునిక సాంకేతికతను ఉపయోగించి నేరాలను కట్టడి చేయాలనే ఉద్దేశంతో కమిషనరేట్ వ్యాప్తంగా డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాల కట్టిడితో పాటు ట్రాఫిక్ క్రమబద్దీకరించడానికి అధికారులు డ్రోన్స్ సహాయంతో పర్యవేక్షిస్తున్నారు.
(5 / 6)
పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించి డ్రోన్ సహాయంతో పేకాటరాయుళ్లను పట్టుకున్నారు. ఎక్కడో చెట్ల మధ్యలో పేకాట ఆడుతున్న వారిని డ్రోన్ కెమెరాతో గుర్తించి ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు పోలీసులు.
ఇతర గ్యాలరీలు