కన్యా రాశిలోకి శుక్రుడు: ఈ రాశుల వారికి అదృష్టం.. డబ్బు, ప్రశాంతత!
శుక్రుడు త్వరలో కన్యారాశిలోకి అడుగుపెట్టనున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి లాభాలు కలగబోతున్నాయి. వారి అదృష్టం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇవే..
(1 / 5)
జ్యోతిషశాస్త్రం ప్రకారం, ప్రస్తుతం శుక్రుడు.. సింహ రాశిలో సంచరిస్తున్నాడు. ఈనెల ఆగస్టు 25వ తేదీన కన్యా రాశిలోకి శుక్రుడు అడుగుపెట్టబోతున్నాడు. దీనివల్ల కొన్ని రాశులకు కలిసి రానుంది.
(2 / 5)
శుక్రుడు ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం వరకు కన్యా రాశిలో సంచరించనున్నాడు. ఈ కాలంలో కొన్ని రాశుల వారికి కలిసి రానుంది. ధనం, మానసిక ప్రశాంతతో పాటు మరిన్ని ప్రయోజనాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఆ రాశులు ఏవంటే..
(3 / 5)
సింహం: కన్యారాశిలో శుక్రుడి సంచారం సింహ రాశి వారికి మేలు చేస్తుంది. ఈ కాలంలో వీరికి మానసిక ప్రశాంతత దక్కుతుంది. ఆత్మవిశ్వాసం అధికమవుతుంది. కుటుంబ పెద్దల సహకారం ఎక్కువగా ఉంటుంది. పిల్లల నుంచి కూడా సంతోషం దక్కే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగానూ మంచి ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉంటాయి.
(4 / 5)
కన్య: ఈ సంచారం కన్యా రాశి వారికి కలిసి వస్తుంది. ఈ కాలంలో వీరి ఆనందం పెరుగుతుంది. ఇల్లు కొనుగోలు చేయవచ్చు. లేకపోతే ఉన్న ఇంటినే విస్తరించుకోవచ్చు. ఉద్యోగం చేసే వారికి పదోన్నతి దక్కే అవకాశాలు ఉంటాయి. తల్లిదండ్రుల నుంచి వీరికి సహకారం అధికమవుతుంది. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులకు లాభాలు అధికమయ్యే ఛాన్స్ ఉంది.
(5 / 5)
మిథునం: కన్యా రాశిలో శుక్రుడు పయనించడం వల్ల మిథున రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. వీరి ఆదాయం ఈ కాలంలో పెరిగే అవకాశాలు ఉన్నాయి. సంతానం కోసం ప్రయత్నించే వారికి శుభవార్తలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో మెరుగుదల వస్తుంది. ఉన్నతాధికారుల సహకరం లభిస్తుంది. ఈ కాలంలో వాహనయోగం కూడా కనిపిస్తోంది. రావాల్సిన ఆస్తి కూడా చేతికి అందే అవకాశం ఉంటుంది. కొందరికి స్థల మార్పిడి కూడా ఉండొచ్చు. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం రూపొందించాం. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు, సందేహాలు, అదనపు సమాచారం కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)
ఇతర గ్యాలరీలు