
(1 / 5)
గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. శుక్రుడు కూడా కాలనుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాడు. శుక్రుడు డబ్బు, విలాసాలు, ప్రేమ, రొమాన్స్ వంటి వాటికి కారకుడు.

(2 / 5)
శుక్రుడు అక్టోబర్ 9న కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది ద్వాదశ రాశులపై ప్రభావం చూపిస్తుంది. నవంబర్ 2 వరకు శుక్రుడు ఇదే రాశిలో ప్రయాణం చేస్తాడు. దీంతో కొన్ని రాశుల వారికి శుభఫలితాలు ఎదురవుతాయి.

(3 / 5)
వృషభ రాశి: వృషభ రాశి వారికి శుక్రుడి కన్య రాశి సంచారం లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారికి ప్రేమ, డబ్బు విషయంలో లోటే ఉండదు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు, బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. కొత్త ఉద్యోగం వస్తుంది. అదృష్టం కూడా మీ వెంట ఉంటుంది.
(pinterest)
(4 / 5)
మిథున రాశి: మిథున రాశి వారికి శుక్ర రాశి మార్పు అనేక విధాలుగా కలిసివస్తుంది. ఈ రాశి వారు సంతోషం, సంపదను పొందుతారు. ఏదైనా ట్రిప్ వేస్తారు, కొత్త వాహనం లేదా ప్రాపర్టీని కొనుగోలు చేస్తారు. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది.
(pinterest)
(5 / 5)
సింహ రాశి: సింహ రాశి వారికి శుక్రుని రాశి మార్పు శుభఫలితాలను అందిస్తుంది. ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. పూర్వికుల నుంచి ఆస్తి లాభం వస్తుంది. కెరీర్‌లో కూడా ఊహించని మార్పులు చూస్తారు. విజయాలను అందుకుంటారు. వ్యాపారులకు కూడా ఇదే మంచి సమయం.
(pinterest)ఇతర గ్యాలరీలు