మరికొన్ని రోజుల్లో వీరి స్టార్ తిరగబోతుంది.. ఊహించని ప్రయోజనాలతో జీవితం ఆనందం!-venus nakshatra change twice in june more luck and huge money profits to these zodiac signs ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మరికొన్ని రోజుల్లో వీరి స్టార్ తిరగబోతుంది.. ఊహించని ప్రయోజనాలతో జీవితం ఆనందం!

మరికొన్ని రోజుల్లో వీరి స్టార్ తిరగబోతుంది.. ఊహించని ప్రయోజనాలతో జీవితం ఆనందం!

Published Jun 07, 2025 10:22 AM IST Anand Sai
Published Jun 07, 2025 10:22 AM IST

శుక్రుడు జూన్ నెలలో రెండుసార్లు తన నక్షత్రాన్ని మారుస్తాడు. కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు శుభ యోగాన్ని తెస్తాడు. ఇది సంపదను పెంచుతుంది. ఆ రాశుల గురించి చూద్దాం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శుక్రుడు చాలా శుభప్రదమైన గ్రహం అని పిలుస్తారు. ఆనందం, శ్రేయస్సు, సంపద, కీర్తి, ప్రేమ ప్రసాదించే గ్రహం. ప్రస్తుతం, శుక్రుడు మేషరాశిలో కదులుతున్నాడు. జూన్ నెలలోనే శుక్రుడు రెండుసార్లు తన నక్షత్రాన్ని మారుస్తాడు. జూన్ 13న మొదటిసారిగా శుక్రుడు భరణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు, ఆపై జూన్ 26న రెండోసారి తన నక్షత్రాన్ని మార్చి కృత్తికా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ విధంగా జూన్ నెలలో శుక్రుడు రెండుసార్లు తన నక్షత్రాన్ని మారుస్తాడు. ఏ రాశులవారికి అదృష్టం వస్తుందో చూద్దాం..

(1 / 4)

వృషభ రాశి వారు శుక్రుడి నక్షత్రాల మార్పు వలన ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలు చేసే వారికి, వ్యాపారం చేసే వృషభ రాశి వారికి ఇది లాభదాయకమైన సమయం అవుతుంది. శుక్రుని శుభ ప్రభావం వల్ల, సమాజంలో మీ గౌరవం, కీర్తి పెరుగుతుంది. మీ ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ కాలంలో వివాహానికి మంచి భాగస్వామి లభించే అవకాశం ఉంటుంది. మతపరమైన, ఆధ్యాత్మిక కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది.

(2 / 4)

తులారాశి వారికి చాలా శుభకరమైన, ప్రయోజనకరమైన ఫలితాలను ఇస్తాడు. ఈ కాలంలో మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టాలనుకునే తులారాశి వారికి ఇది అద్భుతమైన సమయం అవుతుంది. ఈ రాశి వారు పని చేసే వారికి శుక్రుని అనుగ్రహం వల్ల పదోన్నతి, జీతం పెరుగుదల కూడా లభిస్తుంది. శుక్ర నక్షత్ర మార్పు వల్ల మీకు చాలా ప్రయోజనాలు లభిస్తాయి. పెట్టుబడి లేదా ఉద్యోగంలో మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ అసంపూర్ణమైన పని పూర్తవుతుంది. మీ మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.

(3 / 4)

సింహ రాశిలో జన్మించిన వారికి జూన్ నెల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు మీ జీవితంలో అనేక సానుకూల మార్పులను అనుభవిస్తారు. వివాహిత సింహ రాశి వారికి శుక్రుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ కాలంలో మీరు ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. సింహ రాశిలో జన్మించిన వ్యక్తులు ఈ సమయంలో ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. జీవితంలో సానుకూల మార్పులను చూస్తారు. వైవాహిక జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయి. లాభాలు ఆర్జించే అవకాశాలు పెరుగుతాయి. ఈ సమయం మీకు ఆర్థికంగా బలాన్ని ఇస్తుంది. పెట్టుబడి లేదా ఉద్యోగంలో మీరు మంచి లాభాలను పొందుతారు.

(4 / 4)

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు