(1 / 6)
తెలుగులో విడుదలైన దగ్గుబాటి వెంకటేష్ సూపర్ హిట్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం కన్నడ ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే, కన్నడ బుల్లితెరపైకి సంక్రాంతికి వస్తున్నాం వేరే టైటిల్‌తో టీవీ ప్రీమియర్ కానుంది.
(2 / 6)
జీ కన్నడ టీవీ ఛానెల్‌లో వెంకటేష్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం ప్రీమియర్ కానుంది. అది కూడా కన్నడ భాషలో. ఏప్రిల్ 27న సాయంత్రం 4.30 గంటలకు జీ కన్నడలో సంక్రాంతికి వస్తున్నాం ప్రసారం కానుంది.
(3 / 6)
కన్నడ టీవీ ఛానెల్‌లో తెలుగు సినిమా ప్రసారం కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక సంక్రాంతికి వస్తున్నాం కథ విషయానికొస్తే.. ఓ పెద్ద కంపెనీ సీఈఓ, సంపన్న అమెరికన్ వ్యాపారవేత్త సత్య హైదరాబాద్ వస్తాడు. అతన్ని క్షేమంగా వెనక్కి పంపించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపైన ఉంటుంది.
(4 / 6)
కానీ, ఇంతలోనే బిజూ పాండే సత్యను కిడ్నాప్ చేస్తాడు, అతను తన సోదరుడు పాండేను తనకు అప్పగిస్తేనే సత్యను వదిలేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఇంతలో, ఐపిఎస్ అధికారి మీనాక్షి సత్యను విడిపించే బాధ్యతను తీసుకుంటుంది.
(5 / 6)
సస్పెన్షన్‌కు గురైన తన మాజీ ప్రియుడు డీసీపీ రాజు సహాయం కోరుతుంది మీనాక్షి. అయితే రాజు గతం అంతా మర్చిపోయి తన భార్యా పిల్లలతో సంతోషంగా జీవిస్తాడు. మీనాక్షి రాజును ఎలా ఒప్పిస్తుంది? రాజు సత్యను కాపాడతాడా అనేది సినిమా కథ.
(6 / 6)
అనిల్ రావిపూడి దర్శకత్వంలో దగ్గుబాటి వెంకటేష్ కథానాయకుడిగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం కన్నడలో ప్రసారం కానుంది. ఈ సినిమాలో హీరోయిన్స్‌గా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి చేస్తే.. నరేష్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక సంక్రాంతికి వస్తున్నాం ఏప్రిల్ 27న సాయంత్రం 4.30 గంటలకు జీ కన్నడలో ప్రేమ సంక్రాంతి టైటిల్‌తో ప్రసారం కానుంది.
ఇతర గ్యాలరీలు