మదర్స్ డే రోజున అమ్మకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారా? ఈ 5 వస్తువులను పొరపాటున కూడా ఇవ్వద్దని వాస్తు శాస్రం చెబుతోంది!-vastu tips for gifts avoid these 5 gifts for mom on mothers day ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మదర్స్ డే రోజున అమ్మకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారా? ఈ 5 వస్తువులను పొరపాటున కూడా ఇవ్వద్దని వాస్తు శాస్రం చెబుతోంది!

మదర్స్ డే రోజున అమ్మకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారా? ఈ 5 వస్తువులను పొరపాటున కూడా ఇవ్వద్దని వాస్తు శాస్రం చెబుతోంది!

Published May 09, 2025 04:47 PM IST Ramya Sri Marka
Published May 09, 2025 04:47 PM IST

మదర్స్ డే సందర్భంగా అమ్మ కోసం గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నారా? అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు ఇవ్వడం వల్ల ప్రతికూల ప్రభావాలు ఉంటాయని తెలుసుకోండి? ఈ ప్రత్యేకమైన రోజున మీ అమ్మకు ఆనందాన్ని కలిగించేందుకు మీరు కొనే బహుమతుల్లో ఈ 5 రకాల వస్తువులు ఉండకుండా చూసుకోండి.

వాస్తు శాస్త్రం ప్రకారం ఎవరికైనా బహుమతి ఇచ్చే ముందు కూడా వాస్తు నియమాలను పాటించాలి. ప్రత్యేక సందర్భాలలో ప్రియమైనవారికి బహుమతులు ఇచ్చుకునేటప్పుడు మరీ జాగ్రత్తగా ఉండాలి. బహుమతి ద్వారా ఒక వ్యక్తి తన భావాలను కూడా వ్యక్తపరుస్తాడు.  ఇది సంబంధాలలో ప్రేమ, విశ్వాసాలను పెంపొందిస్తుంది. కానీ కొన్నిసార్లు తెలిసో, తెలియకో మీరు ఇచ్చే కొన్ని బహుమతులు మీ సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అందుకే ఈ మదర్స్ డే రోజున అమ్మ కోసం కొనే బహుమతుల్లో ఈ 5 రకాల వస్తువులు లేకుండా చూసుకోండి.

(1 / 6)

సాధారణంగా నలుపు రంగు వస్తువులు చూడటానికి ఆకర్షణీయంగా, అందంగా ఉంటాయి. కానీ ఈ రంగు వస్తువులను బహుమతిగా ఇవ్వడం మంచిది కాదని వాస్తు శాస్త్రం ప్రకారం చెబుతోంది. మదర్స్ డే రోజున అమ్మకు నలుపు రంగు దుస్తులు, గడియారం, బూట్లు, చెప్పులు బహుమతిగా ఇవ్వకూడదు. ఇది మీ బంధంలో దూరం పెరిగేలా చేస్తుంది.

(2 / 6)

అందరినీ ఆకర్షించే సువాసన కలిగిన పెర్ఫ్యూమ్స్‌ను అందరూ ఇష్టపడతారు. అమ్మకు కూడా ఇది నచ్చే బహుమతే అయినప్పటికీ పెర్ఫ్యూమ్స్‌ను బహుమతిగా ఇవ్వడం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చని వాస్తు శాస్త్రం చెబుతోంది..

(3 / 6)

ముత్యాలు చూడటానికి ఎంత అందంగా ఉంటాయో, ధరించడానికి అంత సౌకర్యవంతంగా, హుందాగా ఉంటాయి. కాకపోతే వీటిని కన్నీటికి చిహ్నంగా పరిగణిస్తారు. కాబట్టి అమ్మ కోసం కొనే బహుమతిలో ముత్యాలు లేకుండా చూసుకోండి.

(4 / 6)

వాస్తు ప్రకారం, ఎవరికీ రుమాలు బహుమతిగా ఇవ్వకూడదు. జ్యోతిషశాస్త్రంలో దీనిని అశుభంగా భావిస్తారు. ఇది సంబంధాలను దెబ్బతీస్తుందని నమ్ముతారు. కాబట్టి మదర్స్ డే రోజున పొరపాటున అమ్మకు కర్చిఫ్ కొనివ్వకండి.

(5 / 6)

వాస్తు ప్రకారం, ఎవరికీ పర్స్ బహుమతిగా ఇవ్వకూడదు. అది అమ్మకు అయినా సరే. ఇది  ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

(6 / 6)

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

ఇతర గ్యాలరీలు