(1 / 6)
కొన్ని రకాల వాస్తు నియమాలను పాటించడం ద్వారా ఆఫీస్‌లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, దీని వల్ల కెరీర్‌లో పురోగతి సాధించవచ్చని వాస్తు శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా పని చేసే చోట అంటే ఆఫీస్ టేబుల్ లేదా డెస్క్ మీద కొన్ని రకాల వస్తువులను పెట్టుకోవడం వల్ల అదృష్టం, విజయం కలిసి వస్తాయట. అవేంటో చూడండి.
(2 / 6)
వాస్తు ప్రకారం ఆఫీస్ టేబుల్ మీద లివింగ్ ప్లాంట్స్ తప్పక ఉండాలి. ఇవి ఆఫీసులో ప్రతికూల శక్తులను తగ్గించి సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి. ప్రకృతితో అనుసంధాన లివింగ్ ప్లాంట్స్ గాలిని శుభ్రం చేయడంతో పాటు మీ డెస్క్ ను అందంగా ఉంచుతాయి. మొక్కలకు దగ్గర ఉండటం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది, ధాస్య మెరుగుపడుతుంది. మానసికంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.
(istock)(3 / 6)
వాస్తు శాస్త్రం ప్రకారంఆఫీస్ టేబుల్ మీద గణేశుడు లేదా లక్ష్మీ దేవి బొమ్మలు లేదా ఫొటోలు ఉండటం చాలా మంచిది. ఇవి విజయాన్ని, సంపదను, శ్రేయస్సును ఆకర్షించడంలో సహాయపడతాయి. గణేశుడు అడ్డంకులను తొలగించి, జ్ఞానం, సృజనాత్మకతను పెంచుతాడు. అలాగే లక్ష్మీ దేవి ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధిని తీసుకువస్తుంది. ఇవి
(istock)(4 / 6)
వాస్తు ప్రకారం ఆఫీస్ టేబుల్ మీద గడియారం ఉంచడం పాజిటివ్ ఎనర్జీని పెంచి, విజయానికి దారి తీస్తుంది. సమయపాలన, ఉత్పాదకతను పెంచుతుంది. ఇది పనిలో క్రమశిక్షణను కాపాడుతూ, సమయాన్ని సమర్థవంతంగా వినియోగించడంలో సహాయపడుతుంది. గడియారం తూర్పు లేదా దక్షిణ గోడపై ఉంచితే వాస్తుకి అనుకూలంగా ఉంటుంది.
(istock)(5 / 6)
వాస్తు ప్రకారం ఆఫీస్ టేబుల్ మీద క్రిస్టల్ బాల్ ఉంచడం స్పష్టత, సానుకూల శక్తి, దృష్టి పెంచడంలో సహాయపడుతుంది. ఇది మానసిక స్థిరత్వాన్ని కాపాడుతూ, నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టతను ఇస్తుంది. ఈ శక్తివంతమైన చిహ్నం పనిలో పాజిటివ్ వైబ్స్‌ను పెంచి, విజయాన్ని ఆకర్షిస్తుంది.
(istock)ఇతర గ్యాలరీలు