Operation Valentine Run Time: తక్కువ రన్‍టైమ్‍తోనే ఆపరేషన్ వాలెంటైన్ సినిమా.. సెన్సార్ పూర్తి-varun tej manushi chillar movie operation valentine locks runtime and gets ua censor certificate ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Operation Valentine Run Time: తక్కువ రన్‍టైమ్‍తోనే ఆపరేషన్ వాలెంటైన్ సినిమా.. సెన్సార్ పూర్తి

Operation Valentine Run Time: తక్కువ రన్‍టైమ్‍తోనే ఆపరేషన్ వాలెంటైన్ సినిమా.. సెన్సార్ పూర్తి

Published Feb 28, 2024 11:10 PM IST Chatakonda Krishna Prakash
Published Feb 28, 2024 11:10 PM IST

  • Operation Valentine Movie Run Time - Censor: ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మార్చి 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. దీంతో ఈ మూవీ రన్ టైమ్ వివరాలు బయటికి వచ్చాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

మెగా యంగ్ స్టార్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మార్చి 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‍పై భారత ఎయిర్ ఫోర్స్ చేసిన వైమానిక దాడులు స్ఫూర్తిగా ఈ చిత్రం వస్తోంది.

(1 / 5)

ఆపరేషన్ వాలెంటైన్ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. వరుణ్ తేజ్ సరసన మానుషి చిల్లర్ ఈ చిత్రంలో హీరోయిన్‍గా నటించారు. 

(2 / 5)

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా సెన్సార్ పనులు తాజాగా పూర్తయ్యాయి. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. 

(3 / 5)

సెన్సార్ పూర్తవడంతో ఆపరేషన్ వాలెంటైన్ రన్‍టైమ్ (నిడివి) వివరాలు బయటికి వచ్చాయి. ఈ చిత్రం రన్‍టైమ్ 2 గంటల 4 నిమిషాలు (124 నిమిషాలు)గా ఉంది. చాలా చిత్రాలతో పోలిస్తే ఇది తక్కువ రన్‍టైమే.

(4 / 5)

ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం తెలుగు, హిందీలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కింది. ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. దేశభక్తి ఈ మూవీలో ప్రధానంగా ఉండనుంది. ఎయిర్ ఫోర్స్ అధికారిగా వరుణ్ తేజ్ నటించారు. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు