
(1 / 5)
పేపర్ లీకేజీలో, ప్రచారం వెనక ఎంపీ బండి సంజయ్ పాత్ర ఉందని.. కుట్రదారుడిగా పేర్కొన్నారు పోలీసులు. 420, 120(బి), సెక్షన్ 5 ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.

(2 / 5)
బండి సంజయ్ ను వరంగల్ జిల్లా కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు చేపట్టారు.

(3 / 5)
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత భారీ సంఖ్యలో పోలీసులు బండి సంజయ్ ఇంటిని ముట్టడించారు. అప్పటికే బండి సంజయ్ ఇంటి వద్ద ఉన్న కార్యకర్తలు పోలీసుల్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది.

(4 / 5)
బండి సంజయ్ తరపున వాదనలు వినిపించేందుకు బీజేపీ తరపు న్యాయవాదులు సిద్ధమయ్యారు. రిమాండ్ విధించే అవకాశం ఉన్న నేపథ్యంలో…. పోలీసులు పెట్టిన కేసులను సవాల్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

(5 / 5)
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిసేందుకు యాదాద్రి జిల్లా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన రఘునందర్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లేందుకు రఘునందన్ ప్రయత్నాలు చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఫలితంగా స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఈటల రాజేందర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇతర గ్యాలరీలు