(1 / 5)
శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడలో ఈరోజు వారాహి నవరాత్రుల (గుప్త నవరాత్రులు) ప్రత్యేక పూజలు జరిపారు. శ్రీ వారాహి మాతను సప్త మాతృకలలో మరియు దశ మహావిద్యలలో ఒకరిగా కొలుస్తారు.
(2 / 5)
వారాహి అమ్మవారిని పూజిస్తే ఏమవుతుంది?: వారాహి అమ్మవారిని పూజించుట వలన ప్రతికూలత, చెడు దృష్టి, అనారోగ్యం, ప్రమాదాలు మరియు చెడు కర్మల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. శ్రీ అమ్మవారు సస్య దేవతగా కూడా కొనియాడబడుచున్నారు.
(3 / 5)
సకాలములో పంటలు: శ్రీ వారాహి అమ్మవారిని పూజించుట ద్వారా సకాలములో పంటలు సమృద్ధిగా పండి రైతులు భక్తులు సుఖ సంతోషములతో వర్ధిల్లెదరని పురాణముల ఉవాచ.
(4 / 5)
ఘనంగా పూజలు: ఇంద్రకీలాద్రి పై లోక కళ్యాణార్ధం యాగశాలలో పంచ వారాహి మంత్రములతో శ్రీ అమ్మవారి జప, తర్పణ, హోమములు ఘనంగా జరుగుచున్నవి.
(5 / 5)
ఏకాంత సేవలు: వారాహి నవరాత్రులు సందర్బంగా ఈరోజు ఉదయం శ్రీ అమ్మవారికి పంచ వారాహి మంత్రములతో జపములు, హోమములు (యాగశాలలో) శాస్త్రోక్తంగా ఏకాంత సేవలుగా నిర్వహించడమైనది. తేది.04.07.2025, శుక్రవారం ఉదయము “పూర్ణాహుతి”. వారాహి నవరాత్రి ఉత్సవములు సమాప్తి కార్యక్రమం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనానాయక్ తెలిపారు.
ఇతర గ్యాలరీలు