Uttarkashi Tunnel: చివరి దశకు సహాయ చర్యలు; ఉత్తర కాశి సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ప్రాణాలు సేఫ్..-uttarkashi tunnel rescue live updates 41 trapped workers to be brought out soon check latest news from silkyara ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Uttarkashi Tunnel Rescue Live Updates: 41 Trapped Workers To Be Brought Out Soon, Check Latest News From Silkyara

Uttarkashi Tunnel: చివరి దశకు సహాయ చర్యలు; ఉత్తర కాశి సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ప్రాణాలు సేఫ్..

Nov 28, 2023, 07:40 PM IST HT Telugu Desk
Nov 28, 2023, 07:40 PM , IST

  • Uttarkashi Tunnel Rescue Live Updates:17 రోజుల నిరీక్షణకు తెరపడనుంది. ఉత్తరకాశీలోని సిల్కియారా-బర్కోట్ సొరంగం నుంచి 41 మంది కార్మికులను త్వరలో బయటకు తీసుకురానున్నారు.

కార్మికులు ఉన్న ప్రాంతానికి డ్రిల్లింగ్ పూర్తయిన తరువాత..  ఒక్కో కార్మికుడిని బయటకు తీసుకురావడానికి మూడు నుండి ఐదు నిమిషాలు పడుతుంది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌కు చెందిన మూడు బృందాలు వారిని బయటకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా సహాయం అందిస్తోంది.

(1 / 8)

కార్మికులు చిక్కుకున్న ప్రదేశానికి సుమారు 2 మీటర్ల దూరం వరకు డ్రిల్లింగ్ జరిగింది. కార్మికులకు అత్యంత సమీపంలోకి చేరుకున్నామని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అటా హస్నైన్ చెప్పారు.

(2 / 8)

బయటకు వచ్చిన కార్మికులను వెంటనే వైద్య సేవల కోసం ఆసుపత్రికి తరలించేందుకు చినూక్ హెలికాప్టర్లను చినల్లిసౌర్ వద్ద సిద్ధంగా ఉంచారు.

(3 / 8)

సొరంగం ముఖద్వారం వద్ద తాత్కాలిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించారు. అందులో ఎనిమిది పడకలను ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసింది. అక్కడ వైద్యులను కూడా సిద్ధంగా ఉంచారు.

(4 / 8)

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర మంత్రి జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్ మంగళవారం సిల్కియారా-బర్కోట్ సొరంగం వద్దకు చేరుకున్నారు. కార్మికులకు స్వాగతం పలికేందుకు ఇప్పటికే 41 పూల దండలను సిద్ధం చేశారు. 

(5 / 8)

సిల్కియారా-బార్కోట్ టన్నెల్ వెలుపల 41 అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కుటుంబ సభ్యులు ఇప్పటికే ఘటనాస్థలానికి చేరుకున్నారు.

(6 / 8)

సొరంగంలో చిక్కుకున్న కార్మికుడు గబ్బర్ సింగ్ నేగి సోదరుడు జైమల్ మాట్లాడుతూ, 'చివరికి దేవుడు మా ప్రార్థనలు విన్నాడు. నా సోదరుడు సురక్షితంగా బయటకు వస్తాడు' అన్నారు.

(7 / 8)

సోమవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ర్యాట్ హోల్ మైనింగ్ ప్రారంభించారు. 24 గంటల్లో 12 మీటర్ల మేర శిథిలాలను తొలగించారు. శిథిలాల తొలగింపు పనులు పూర్తయ్యాయి. కార్మికులను బయటకు తీసుకురావడానికి ఇరుకైన పైపును కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కూలీలను బయటకు తీసుకొచ్చే పని మాత్రమే మిగిలి ఉంది.

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు