తెలుగు న్యూస్ / ఫోటో /
Uttarakhand Tunnel collapse: 48 గంటలు దాటింది.. సొరంగంలో చిక్కుకున్న ఆ కార్మికులు సురక్షితమేనా?
Uttarakhand Tunnel collapse: ఉత్తరాఖండ్ లో సొరంగం కుప్పకూలిన ఘటనలో ఆ శిధిలాల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి అధికారులు కృషి చేస్తున్నారు. వారి ప్రాణాలకు ప్రమాదం లేదని హామీ ఇస్తున్నారు. కానీ, వారు సొరంగంలో చిక్కుకుని 48 గంటలు దాటిపోయాయి. .
(1 / 5)
ఉత్తరకాశీలోని సిల్క్యారా - దద్లాగావ్ మధ్య బ్రహ్మఖల్-యమునోత్రి సొరంగం ఆదివారం ఉదయం కుప్పకూలింది. 48 గంటల తర్వాత కూడా ఆ ప్రమాదంలో చిక్కుకున్న 40 మంది కార్మికులను రక్షించలేకపోయారు. అయితే ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.(AFP)
(2 / 5)
రెస్క్యూ టీమ్ ఆదివారం రాత్రి వరకు ఆ సొరంగంలో చిక్కుకున్న కార్మికులతో కమ్యూనికేషన్ సాధించగలిగారు. ఆ తరువాత, సొరంగంలో వారు చిక్కుకున్న ప్రదేశం సమీపంలో 40 మీటర్ల మేర తవ్వేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అప్పటి నుంచి 21 మీటర్లు దూరం వరకు వెళ్లగలిగారు. ఈ సొరంగం కేంద్ర ప్రభుత్వం యొక్క చార్‌ధామ్ ప్రాజెక్ట్‌లో భాగం.(AFP)
(3 / 5)
ఆ 200 మీటర్ల సొరంగం నుంచి 40 మంది కార్మికులను రక్షించేందుకు 21 మీటర్ల స్లాబ్ రోడ్డును అడ్డుకుంటోంది. ఆ స్లాబ్‌ను తొలగించి, అక్కడి నుంచి 900 ఎంఎం పైపును కార్మికులు ఉన్న వైపు పంపించాలన్నది ప్లాన్.(AFP)
(4 / 5)
సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు ఆహారం అందించే ప్రక్రియ కూడా విజయవంతంగా ప్రారంభమైంది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న 40 మంది కార్మికుల్లో పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల కార్మికులు ఉన్నారు. (AFP)
ఇతర గ్యాలరీలు