Papaya Fruit Face Pack: ఎండకు చర్మం నల్లబడిందా? అయితే బొప్పాయి ప్యాక్ వేసుకోండి!-use papaya fruit face pack for 2 months to get fair and glowing skin ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Papaya Fruit Face Pack: ఎండకు చర్మం నల్లబడిందా? అయితే బొప్పాయి ప్యాక్ వేసుకోండి!

Papaya Fruit Face Pack: ఎండకు చర్మం నల్లబడిందా? అయితే బొప్పాయి ప్యాక్ వేసుకోండి!

Published Apr 22, 2023 06:32 PM IST HT Telugu Desk
Published Apr 22, 2023 06:32 PM IST

  • Papaya Fruit Face Pack: వేసవిలో స్కిన్ ట్యాన్ సమస్యలు చాలా సాధారణం. గాలిలో తేమ తక్కువగా ఉండడం వల్ల చర్మం కూడా పొడిబారుతోంది. అయితే ఈ ఎండలో బొప్పాయి మీ ముఖానికి మ్యాజిక్‌లా పని చేస్తుంది.

వేసవి కాలంలో చర్మానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఇందుకోసం మీకు కాలానుగుణంగా లభించే పండ్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ వేసవి కాలంలో మామిడి, పుచ్చకాయ వంటి పండ్లే కాదు, బొప్పాయి కూడా దొరుకుతుంది. ఇది శరీరానికి, చర్మానికి కూడా మేలు చేస్తుంది. బొప్పాయి పేస్ట్‌ని కొన్ని రోజులు ముఖానికి అప్లై చేస్తే మార్పును మీరే చూడవచ్చు. మీ చర్మానికి బొప్పాయి వల్ల కలిగే ప్రయోజనాలను చూడండి

(1 / 5)

మీరు బొప్పాయి ఫేస్ ప్యాక్‌ను ఎక్కువసేపు అప్లై చేస్తే, అది ముఖం టానింగ్‌ను తొలగించి, చర్మాన్ని మెరుగుపరుస్తుంది. 2 టేబుల్ స్పూన్ల తురిమిన బొప్పాయిని ఒక చెంచా ముల్తానీ మట్టితో కలపండి. ఇప్పుడు దీన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి కడిగేయాలి. మీరు ప్రతి మధ్యాహ్నం ఇలా అప్లై చేసుకోవచ్చు.

(2 / 5)

స్క్రబ్బింగ్ చేయడం వల్ల చాలా మందికి చర్మం పొడిబారుతుంది. బదులుగా బొప్పాయి ఫేస్ ప్యాక్ వేసుకోండి. ఇది డెడ్ స్కిన్ ను తొలగిస్తుంది కానీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఖరీదైన స్క్రబ్ కోసం డబ్బు ఖర్చు చేయకుండా, పండిన బొప్పాయిని మెత్తగా చేసి, చిటికెడు రాళ్ల ఉప్పుతో కలపండి. ఈ ఫేస్ ప్యాక్ వేసుకుని ఆరిన తర్వాత కడిగేయాలి. 

(3 / 5)

వయసు పెరిగే కొద్దీ చర్మంపై ముడతలు వస్తాయి. బొప్పాయి ఫేస్ ప్యాక్‌ని నిరంతరం అప్లై చేయడం వల్ల ఈ ముడతలు మాయమవుతాయి. మీరు కళ్ల చుట్టూ ఉన్న చర్మానికి బొప్పాయి ఫేస్ ప్యాక్ రాసుకోవచ్చు. బొప్పాయి తురుములో  రెండు చుక్కల బాదం నూనె కలపాలి. అది మొఖానికి వేసుకొని, ఆరిపోయిన తర్వాత ముఖం కడగాలి. మెడపై కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు కొద్ది రోజుల్లోనే తేడాను చూడగలరు. 

(4 / 5)

ఎండలకు చాలా మందికి చేతులు, కాళ్ళపై నల్లగా మారతాయి,  ముఖం నల్లగా మారుతుంది. అలాంటప్పుడు పండిన బొప్పాయి గుజ్జును తేనెతో కలిపి వారానికి రెండు సార్లు అప్లై చేసుకోండి. అరగంట పాటు అప్లై చేయడం వల్ల చర్మం మెరుస్తుంది.

(5 / 5)

(Unsplash)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు