(1 / 6)
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఇందులో దబిడి దిబిడి ఐటమ్ సాంగ్ చేయడమే కాకుండా ఓ కీ రోల్ కూడా ప్లే చేసింది బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌటెలా. ఈ సాంగ్‌లోని స్టెప్స్ కాస్తా కాంట్రవర్సీ అయిన పాట మాత్రం మంచి క్రేజ్ తెచ్చుకుంది.
(2 / 6)
బోయపాటి శీను-ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్కంద. రామ్ పోతినేని డ్యుయల్ రోల్ చేసిన స్కందలో కల్ట్ మామ అనే ఐటమ్ సాంగ్‌లో నర్తించింది ఊర్వశి రౌటెలా. రామ్‌తో కలిసి అదిరిపోయే స్టెప్పులేసింది.
(3 / 6)
అఖిల్ అక్కినేని నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఏజెంట్. వైల్డ్ సాలా అంటూ థియేటర్లలో విడుదలై డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమాలో వైల్డ్ సాలా అనే ఐటమ్ పాటలో అఖిల్‌తో కలిసి నర్తించింది ఊర్వశి రౌటెలా.
(4 / 6)
పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ఫ్యామిలీ డ్రామా చిత్రం బ్రో. ఈ సినిమాలో మై డియర్ మార్కండేయ అనే పార్టీ సాంగ్‌లో బాలీవుడ్ హాట్ బ్యూటి ఊర్వశి రౌటెలా స్టెప్పులేసి తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంది.
(5 / 6)
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ చాలా కాలం తర్వాత కలిసి నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఈ మూవీలో బాస్ పార్టీ అనే ఐటమ్ సాంగ్‌లో చిరంజీవితో కలిసి ఆడిపాడింది ఊర్వశి రౌటెలా.
(6 / 6)
ఇవే కాకుండా ఊర్వశి రౌటెలా హీరోయిన్‌గా తెరకెక్కించాలనుకున్న తెలుగు సినిమా బ్లాక్ రోజ్. ఈ సినిమా నుంచి నా తప్పు ఏమున్నదబ్బా అనే స్పెషల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. కానీ, బ్లాక్ రోజ్ షూటింగ్, రిలీజ్‌పై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు.
ఇతర గ్యాలరీలు