తెలుగు న్యూస్ / ఫోటో /
AP TG Weather Updates : బంగాళాఖాతంలో వాయుగుండం..! నవంబర్ 26న ఏపీకి భారీ వర్ష సూచన
- AP TG Rain Updates : తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ మరోసారి అలర్ట్ ఇచ్చింది. రేపు దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆపై నవంబర్ 23వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతోందని పేర్కొంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 6)
దక్షిణ అండమాన్ సముద్రం మరియు దాని పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం నవంబర్ 21వ తేదీన ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా నవంబర్ 23న అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.
(2 / 6)
. ఆ తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తదుపరి 2 రోజుల్లో మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వివరించింది.(Unsplash)
(3 / 6)
ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, సీమ ప్రాంతాల్లో ఇవాళ, రేపు, ఎల్లుండి వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
(4 / 6)
అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో నవంబర్ 26వ తేదీన దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.(Unsplash)
(5 / 6)
ఇక తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని వివరించింది.(pixabay)
ఇతర గ్యాలరీలు