యూపీఐతో వాడుతుంటే ఈ 5 ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి.. లేకపోతే ప్రమాదం!-upi fraud alert never forget these 5 things while making upi transactions otherwise you will see loss ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  యూపీఐతో వాడుతుంటే ఈ 5 ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి.. లేకపోతే ప్రమాదం!

యూపీఐతో వాడుతుంటే ఈ 5 ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి.. లేకపోతే ప్రమాదం!

Published Jun 16, 2025 10:01 PM IST Anand Sai
Published Jun 16, 2025 10:01 PM IST

యూపీఐ రాకతో డబ్బు చెల్లింపులు ఈజీ అయిపోయాయి. అయితే దీనితోపాటుగా మోసాలు కూడా పెరిగాయి. కొంచెం జాగ్రత్త పడితే వేల, లక్షల రూపాయల నష్టం నుంచి కాపాడుకోవచ్చు. యూపీఐని సురక్షితంగా ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకోండి

యూపీఐ నేడు మన జీవితంలో ఒక భాగంగా మారింది. కిరాణా దుకాణం అయినా, ట్యాక్సీ ఛార్జీ అయినా, ఆన్లైన్ షాపింగ్ అయినా దాదాపు అన్ని చోట్లా యూపీఐతోనే చెల్లిస్తున్నాం. కానీ దీన్ని ఉపయోగించడం ఎంత సులభమో, అంతే మోసం చేసే ప్రమాదం కూడా ఉంది. ప్రతిరోజూ వేలాది మంది సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. మీరు కూడా రోజూ యూపీఐని ఉపయోగిస్తుంటే ఈ 5 విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.

(1 / 6)

తెలియని వారికి యూపీఐ పిన్ ఎప్పుడూ వెల్లడించవద్దు. ఏ బ్యాంక్ అధికారి లేదా యూపీఐ యాప్ సపోర్ట్ టీమ్ మిమ్మల్ని ఓటిపి, పిన్ లేదా పాస్‌వర్డ్ అడగదు. ఎవరైనా తమను తాము బ్యాంకు లేదా కస్టమర్ సపోర్ట్ అని చెప్పి మీ నుండి పిన్ అడుగుతుంటే, అది మోసం అని అర్థం చేసుకోండి.

(2 / 6)

స్క్రీన్ షేరింగ్ యాప్స్ కు దూరంగా ఉండండి. ఈ రోజుల్లో మోసగాళ్లు ఎనీడెస్క్, టీమ్ వ్యూవర్ వంటి స్క్రీన్ షేరింగ్ యాప్స్ ద్వారా మీ మొబైల్ ను యాక్సెస్ చేస్తున్నారు. మీ బ్యాంక్ యాప్స్, యూపీఐ, పాస్‌వర్డ్‌లను యాక్సెస్ చేస్తారు. అపరిచితులు చెబితే స్క్రీన్ షేరింగ్ యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవద్దు.

(3 / 6)

ఆలోచించకుండా పే రిక్వెస్ట్‌ను అంగీకరించవద్దు. చాలా సార్లు మోసగాళ్లు డబ్బు పంపుతామనే నెపంతో మీకు 'పే రిక్వెస్ట్' పంపుతారు. మీరు అనుకోకుండా ఓకే  చేస్తే మీ ఖాతా నుండి డబ్బు కట్ అవుతుంది. మీరు ఊహించని చెల్లింపు అభ్యర్థనను అందుకున్నట్లయితే వెంటనే తిరస్కరించండి.

(4 / 6)

క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసే ముందు జాగ్రత్తగా ఉండండి. ప్రతి క్యూఆర్ కోడ్ డబ్బు తీసుకోవడానికి ఉద్దేశించినది కాదు. చాలాసార్లు మోసగాళ్లు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేస్తుంటారు. ఎవరైనా 'క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డబ్బులు వస్తాయి' అని చెబితే అప్రమత్తంగా ఉండండి.

(5 / 6)

బ్యాంక్, యూపీఐ యాప్స్ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌ను ఉపయోగించండి. మోసగాళ్లు నకిలీ యాప్, వెబ్‌సైట్ల ద్వారా మీ ఖాతా సమాచారాన్ని దొంగిలించవచ్చు. ఎల్లప్పుడూ గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుండి యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండి. తెలియని వెబ్సైట్ లేదా లింక్ నుంచి ఏ యాప్‌ను డౌన్లోడ్ చేయవద్దు.

(6 / 6)

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు