Upcoming Phones: డిసెంబర్ నెలలో వస్తున్న లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..
- Upcoming Phones December 2023: డిసెంబర్ నెల స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో అంచనాలను పెంచేసింది. ఎంట్రీ-లెవల్ ఫోన్‌ల నుంచి ఫీచర్-ప్యాక్డ్ ఫోన్‌ల వరకు డిసెంబర్లో మార్కెట్లోకి వస్తున్నాయి. డిసెంబర్‌లో ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానున్న ఫోన్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.
- Upcoming Phones December 2023: డిసెంబర్ నెల స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో అంచనాలను పెంచేసింది. ఎంట్రీ-లెవల్ ఫోన్‌ల నుంచి ఫీచర్-ప్యాక్డ్ ఫోన్‌ల వరకు డిసెంబర్లో మార్కెట్లోకి వస్తున్నాయి. డిసెంబర్‌లో ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానున్న ఫోన్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.
(1 / 6)
మార్కెట్‌లో ప్రతి నెలా కొత్త స్మార్ట్‌ఫోన్‌లు విడుదలవుతుంటాయి. నవంబర్ నెలలో కూడా అనేక ఫ్లాగ్‌షిప్, ప్రీమియం సిరీస్ ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. లావా బ్లేజ్ 2 5G వంటి మంచి ఫీచర్లు కలిగిన తక్కువ-ధర ఫోన్‌లు భారతీయ మార్కెట్లోకి ప్రవేశించాయి.
(2 / 6)
డిసెంబర్‌లో కూడా వివిధ కంపెనీల లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ కానున్నాయి. ముఖ్యంగా ఐక్యూ 12 5జి ఫోన్ ధరలోనే ఎంట్రీ-లెవల్ రెడ్‌మి 13సి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Realme GT5 Pro, Redmi K70 సిరీస్, OnePlus 5G ఫోన్‌లు లాంచ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి.
(3 / 6)
OnePlus 12 5G: డిసెంబర్ నెలలో చైనా మార్కెట్లో లాంచ్ అవుతున్న ఈ స్మార్ట్‌ఫోన్ జనవరి 23, 2024న భారత మార్కెట్‌లోకి ప్రవేశించవచ్చు కానీ ఈ స్మార్ట్‌ఫోన్ ధర ప్రస్తుతం ఉన్న OnePlus 11 5G కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది.
(4 / 6)
Realme GT5 ప్రో: ఈ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 7న చైనాలో లాంచ్ అవుతుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen3 చిప్‌సెట్, వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు 1TB స్టోరేజ్‌తో వస్తుంది. భారతదేశంలో ఈ ఫోన్ లాంచ్ తేదీ గురించి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. అయితే వచ్చే ఏడాది విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ ఫోన్ ధర రూ. 50,000 నుండి 60,000 మధ్య ఉండవచ్చు.
(5 / 6)
IQ 12 5G: ఈ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 12 న భారతదేశంలో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్‌ని కలిగి ఉంది. వెనుకవైపు 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్, 64MP పెరిస్కోప్ లెన్స్ ఉన్నాయి.
(6 / 6)
Redmi Note 13సిరీస్ 5జీ ఫోన్స్: మిడ్-రేంజ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లుగా ప్రఖ్యాతి గాంచిన రెడి మి ఫోన్స్ లో లేటెస్ట్ సిరీస్ ఫోన్స్ డిసెంబర్ లో మార్కెట్లోకి రానున్నాయి. రెడ్ మి నోట్ 13, రెడ్ మి నోట్ 13 ప్రో, రెడ్ మి నోట్ 13 ప్రొ ప్లస్., ఈ మూడు మోడల్‌లు ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యాయి. ఈ సిరీస్ ప్రారంభ ధర రూ.15,000 గా ఉండవచ్చు. టాప్ ఎండ్ ధర రూ. 30,000 వరకు ఉండవచ్చు.
ఇతర గ్యాలరీలు