(1 / 6)
42 ఏళ్ల వయసులో బాలీవుడ్ నటి షెపాలి జరివాలా మరణించారు. 2002లో వచ్చిన ‘కాంటా లాగా’ వీడియో సాంగ్ తో ఆమె పాపులర్ అయ్యారు. ఆ తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్ లు చేశారు. హిందీ బిగ్ బాస్ 13వ సీజన్ తో మరింత ఫేమ్ సంపాదించుకున్నారు.
(instagram-shefalijariwala)(2 / 6)
షెఫాలి ఫస్ట్ మ్యూజిషియన్ హర్మీత్ సింగ్ ను పెళ్లి చేసుకున్నారు. 2004లో వీళ్ల పెళ్లి జరిగింది. కానీ ఈ జంట 2009లో విడాకులు తీసుకుంది. తన మాజీ భర్త టార్చర్ చేసేవాడని షెఫాలి చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు.
(instagram-shefalijariwala)(3 / 6)
హర్మీత్ ను పెళ్లి చేసుకునే కంటే ముందే సిద్ధార్థ్ శుక్లాతో షెఫాలి జరివాలా డేటింగ్ లో ఉంది. ఇంటర్ చదివే రోజుల్లోనే వీళ్లు ప్రేమించుకున్నారు. ఈ విషయం హర్మీత్, ఇప్పటి భర్త పరాగ్ త్యాగికి తెలుసు.
(instagram-shefalijariwala)(4 / 6)
పరాగ్ త్యాగిని 2014లో పెళ్లి చేసుకుంది షెఫాలి. అంతకంటే ముందు ఏడాది పాటు వీళ్లు సహ జీనవం చేశారు. పిల్లలంటే షెఫాలికి చాలా ఇష్టం. 12 ఏళ్ల వయసులోనే ఓ చిన్నారిని దత్తత తీసుకోవాలని అనుకుందటా. ఇప్పుడు పరాగ్ తనకంటే 7 ఏళ్లు పెద్ద వాడు కావడంతో పిల్లలు కాలేకపోతున్నారంటూ ఆమె ఓపెన్ గానే చెప్పారు.
(instagram-shefalijariwala)(5 / 6)
పరాగ్ తో షెఫాలి పెళ్లి ఎవరూ లేకుండానే జరిగింది. రెండు సార్లు పెళ్లి ముహూర్తం పెట్టుకుంటే క్యాన్సల్ అయింది. దీంతో ఓ రోజు ఇంట్లోనే రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నారు. అప్పుడు కేవలం షెఫాలి పెంపుడు కుక్క మాత్రమే ఉంది.
(instagram-shefalijariwala)(6 / 6)
షెఫాలి జరివాలా నెట్ వర్త్ రూ.7.5 కోట్లుగా ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో 34 లక్షల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న ఆమె.. బ్రాండ్ ప్రమోషన్లతో ఎక్కువగా సంపాదించేవారు.
(instagram-shefalijariwala)ఇతర గ్యాలరీలు