Rajamahendravaram Railway Station : మారనున్న 'రాజమహేంద్రవరం' రైల్వే స్టేషన్ రూపురేఖలు - ఈ ఫొటోలు చూడండి
- Rajamahendravaram Railway Station Redevelopment: రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ కొత్తరూపు సంతరించుకోనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వేశాఖ అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం రైల్వే శాఖ రూ.271.43 కోట్లు కేటాయించింది. పునరాభివృద్ధి పనులను త్వరలో ప్రారంభించనున్నారు.
- Rajamahendravaram Railway Station Redevelopment: రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ కొత్తరూపు సంతరించుకోనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వేశాఖ అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం రైల్వే శాఖ రూ.271.43 కోట్లు కేటాయించింది. పునరాభివృద్ధి పనులను త్వరలో ప్రారంభించనున్నారు.
(1 / 6)
రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ ను అభివృద్ధి చేసే అడుగులు పడుతున్నాయి. కొత్త అంచనాలతో పంపిన ప్రతిపాదనలకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. త్వరలోనే పునరాభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి.
(2 / 6)
స్టేషన్ పునరాభివృద్ధి(రీ-డెవలప్‌మెంట్) ప్రాజెక్టుకు రైల్వే మంత్రిత్వ శాఖ రూ.271.43 కోట్లు మంజూరు చేసింది. రానున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా పనులను త్వరలోనే ప్రారంభించనున్నారు.
(3 / 6)
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రాజమహేంద్రవరం పునరాభివృద్ధి పనులు చేపట్టేందుకు ఎన్నికల ముందు ప్రధాని శంకుస్థాపన చేశారు. రూ.250 కోట్లతో ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. ఆ తర్వాత కొత్త ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి, దీంతో టెండర్ల దశలోనే ఆ ప్రక్రియ నిలిచిపోయింది.
(image source @DDNewsAndhra)(4 / 6)
రాజమహేంద్రవరం స్టేషన్ తూర్పు, పశ్చిమ ప్రాంతాలు రెండూ అభివృద్ధి చెందేలా తాజా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటికి రైల్వేశాఖకు పంపగా… తాజాగా ఆమోదం లభించింది. రైల్వేస్టేషన్ అభివృద్ధికి కేంద్రం రూ.271.43 కోట్లు కేటాయించింది.
(image source @DDNewsAndhra)(5 / 6)
రైల్వే స్టేషన్ అభివృద్ధిలో భాగంగా ప్లాట్‌ఫామ్‌ల అనుసంధానం మెరుగుపరచడానికి స్టేషన్‌కు ఇరువైపులా ఆరు మీటర్ల వెడల్పుతో రెండు పాదచారుల వంతెనలను నిర్మిస్తారు. భవిష్యత్తులో పెరగనున్న రైళ్ల రద్దీకి అనుగుణంగా అదనపు ప్లాట్‌ఫామ్ నిర్మిస్తారు.
(6 / 6)
పార్కింగ్ సౌకర్యాలను మరింతగా అభివృద్ధి చేస్తారు. పార్కింగ్ సామర్థ్యాన్ని మరింత పెంచడానికి బహుళ అంతస్తుల కార్ పార్కింగ్ సదుపాయం కల్పిస్తారు. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పునరాభివృద్ధి పనులను త్వరలో ప్రారంభించనున్నారు. ఆ దిశగా రైల్వే అధికారులు కసరత్తు చేపట్టారు.
(image source @DDNewsAndhra)ఇతర గ్యాలరీలు