తెలుగు న్యూస్ / ఫోటో /
Bhogapuram Airport: 2026కల్లా అందుబాటులోకి రానున్న భోగాపురం విమానాశ్రయం, పనులు పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడ
- Bhogapuram Airport: నిర్ణీత గడువు కంటే ముందే భోగాపురం విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు జిఎంఆర్ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భోగాపురంలో పర్యటించారు.
- Bhogapuram Airport: నిర్ణీత గడువు కంటే ముందే భోగాపురం విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు జిఎంఆర్ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భోగాపురంలో పర్యటించారు.
(1 / 8)
ఎయిర్‌పోర్టు టెర్మినల్ భవనం నిర్మాణం పనులను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. నిర్మాణం పనులపై ఏర్పాటు చేసిన ప్రజంటేషన్ ను పరిశీలించారు. రన్‌వే పనులను కూడా కేంద్ర మంత్రి పరిశీలించారు.
(2 / 8)
భోగాపురం విమానాశ్రయంలో ట్రంపెట్ నిర్మాణం, జాతీయ రహదారి నుంచి ఎయిర్‌పోర్టు అనుసంధాన రోడ్డు నిర్మాణం గురించి అందుకు అవసరమైన భూసేకరణపై జిల్లా కలెక్టర్ అంబేద్కర్, జాతీయ రహదారుల సంస్థ అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు.
(3 / 8)
కేంద్ర పౌరవిమానయాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం తొలిసారిగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ఎయిర్ పోర్టు ట్రంపెట్ వద్ద స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, జి.ఎం.ఆర్.సంస్థ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు.
(4 / 8)
భోగాపురంలో ప్రయాణికులతో పాటు 50వేల టన్నుల కార్గో హ్యాండ్లింగ్ చేసే విధంగా కార్గో టెర్మినల్ కూడా నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఎయిర్‌పోర్టుతో పాటు ఎం.ఆర్.ఓ. విభాగం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దేశంలోనే నెంబర్‌వన్ ఎయిర్‌పోర్టుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రూపొందించే దిశగా కృషిచేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
(5 / 8)
భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం పనులు పూర్తిచేయాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు జిఎంఆర్ ప్రతినిధుల్ని సూచించారు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ శాఖల ద్వారా అవసరమైన అనుమతులన్నీ సత్వరమే మంజూరుచేసి పూర్తి సహకారాన్ని అందజేస్తామని చెప్పారు.
(6 / 8)
నిర్ణీత కాలవ్యవధిలో భోగాపురం విమానాశ్రయ పనులను పూర్తిచేసేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు రామ్మోహన్ నాయుడు చెప్పారు. డిసెంబరు 2026 నాటికి పూర్తిచేయాల్సి వుండగా గడువు కంటే 6 నెలల ముందుగా పూర్తిచేయాలని జి.ఎం.ఆర్.సంస్థను కోరారు.
(7 / 8)
ప్రస్తుత విశాఖ ఎయిర్‌పోర్టు ద్వారా ఏడాదికి 28 లక్షల మంది ప్రయాణిస్తుండగా 2026 నాటికి కొత్తగా ప్రారంభించే భోగాపురం ఎయిర్‌పోర్టు ద్వారా ప్రారంభంలోనే 50 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నట్టు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ చెప్పారు. ఈ విమానాశ్రయాన్ని 60 లక్షల మంది ప్రయాణించే సామర్ధ్యంతో నిర్మిస్తున్నామని చెప్పారు.
(8 / 8)
ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిలో ఎంతో కీలకమైన, యీ ప్రాంతానికి గుండెకాయ వంటి భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని 2026 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిచేయాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నిర్వహణ సంస్థ జి.ఎం.ఆర్. సంస్థ ప్రతినిధులను కోరారు.
ఇతర గ్యాలరీలు