(1 / 5)
ఐపీఎల్ 2025 ఫైనల్ కు యూకే మాజీ ప్రధాని రిషి సునాక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. భార్య అక్షత మూర్తితో కలిసి ఆయన ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించారు.
(PTI)(2 / 5)
అహ్మదాబాద్ లో జరుగుతున్న ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ ను చూసేందుకు సతీసమేతంగా వచ్చిన రిషి సునాక్ స్టేడియంలోని ఫ్యాన్స్ ను పలకరించారు. భార్యతో కలిసి గ్రౌండ్ నుంచి చేతులు ఊపుతూ హాయ్ చెప్పారు.
(AP)(3 / 5)
బెంగళూరు కుటుంబానికి చెందిన అక్షత మూర్తిని పెళ్లి చేసుకున్న రిషి సునాక్.. ఈ ఫైనల్లో ఆర్సీబీకి సపోర్ట్ చేస్తున్నారు. ఆ టీమ్ బౌండరీలు కొట్టినప్పుడల్లా, వికెట్లు తీసినప్పుడల్లా కమాన్ అంటూ చీర్ చేస్తున్నారు. ‘లెట్స్ గో ఆర్సీబీ’ అంటూ ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు రిషి సునాక్.
(@RishiSunak)(4 / 5)
ఐసీసీ ఛైర్మన్ జై షా ఫ్యామిలీతో కలిసి స్టాండ్స్ లో కూర్చుని రిషి సునాక్, అక్షత మూర్తి మ్యాచ్ ను ఎంజాయ్ చేశారు. అంతకుముందు స్టేడియంలో రిషి సునాక్ దంపతులకు ఘన స్వాగతం లభించింది.
(PTI)(5 / 5)
ప్రపంచ క్రికెట్ ను ఐపీఎల్ ఎంతలా మార్చిందనే విషయాన్ని జై షాతో చర్చించానని ఇన్నింగ్స్ బ్రేక్ మధ్యలో రిషి సునాక్ చెప్పారు. ఒలింపిక్స్ లో క్రికెట్ రీ ఎంట్రీకి ఇండియానే కారణమని కూడా అన్నారు.
(PTI)ఇతర గ్యాలరీలు