(1 / 10)
డయాబెటిస్ వుందని తెలియగానే పిల్లలు, వారి తలిదండ్రులలో ఆందోళన కలగడం సహజమే. కానీ మొదట కాస్త బాధ, వ్యతిరేకత, సమస్యను అంగీకరించలేక పోవడం జరిగినా, క్రమంగా సర్దుకుపోవడం, అలవాటు పడటం జరుగుతుంది.
(2 / 10)
తలిదండ్రులు తమను తాము నిభాయించుకొని ఆ తరువాత పిల్లలకు మానసికంగా ధైర్యం చెప్పి, 'అన్నింటికీ మేము తోడుంటామనే భరోసా పిల్లలకు కల్పించాలి. అవసరమైతే సైకాలజిస్ట్‌లతో కౌన్సిలింగ్ ఇప్పించాలి.
(3 / 10)
డయాబెటిస్ సమస్య పిల్లలలో ప్రతి వేయిమందిలో ఇద్దరిలో ఉంటోంది.రాను రాను టైప్ -1 డయాబెటిస్‌తో పాటు టైప్ 2 డయాబెటిస్ కూడా పిల్లలలో ఎక్కువగా కనిపిస్తోంది.వీరిలో ఎక్కువ మంది బడికి వెళ్ళే విద్యార్థులే ఉన్నారు.
(4 / 10)
రక్త పరీక్షల కోసం చేతులపై గుచ్చడం, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ప్రతిరోజు వేసుకోవాల్సి రావడంపై పిల్లలకు భయం వుండటం సహజమే.కానీ దాని అవసరాన్ని,అలా వేసుకొంటే రోజంతా వుండే సౌకర్యాన్ని, వేసుకోకపోతే జరిగే అనర్థాలను పిల్లలకు వివరించాలి. తమ జబ్బును తామే నియంత్రించుకునే వ్యక్తులుగా మానసికంగా తీర్చిదిద్దాలి.
(5 / 10)
పిల్లలను చురుగ్గా ఉంచుతూ వారు రక్తపరీక్ష చేయించుకున్నా, ఇంజెక్షన్ వేయించుకున్నా అభినందించడం, ఆలింగనాలతో ఉత్తేజితుల్ని చేయడం చెయ్యాలి. డయాబెటిస్‌తో జీవిస్తూ మందులు వాడుతూ, పరీక్షలు చేయించుకుంటున్న ఇతర పిల్లలతో వారు కలసి వారిని గమనించేలా ఏర్పాట్లు చేయాలి. వారి ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ ఛార్ట్స్ తయారు చేసి,వాటిని తరచూ చూసేలా ఏర్పాట్లు చేయాలి.
(6 / 10)
డయాబెటిస్‌తో బాధపడే పిల్లలలో ఎక్కువ మంది విద్యార్థులు ఉంటున్నారు. విద్యార్థులు ఎక్కువ సమయం గడిపేది పాఠశాలల్లోనే కాబట్టి డయాబెటిస్ గురించి, ఆహారం, సమస్యలు, చికిత్స గురించి తలిదండ్రులతో పాటు పాఠశాలలోకేర్‌టేకర్స్, ఉపాధ్యాయులు,సిబ్బందికి అవగాహన అవసరమవుతుంది.
(7 / 10)
చిన్నారుల్లో మధుమేహం గుర్తిస్తే విద్యార్థి వయసుకున్న పరిమితులు, బడిలో విద్యార్థి - ఆహారము - లభ్యత - సమయం సహాయం అందే ఏర్పాటు చేయాలి. ఇన్సులిన్ ఏఏ సమయాల్లో ఎంత వేయాలి? విద్యార్థి స్వయంగా వేసుకోలేకపోతే, ఎవరు ఆ బాధ్యత స్వీకరించాలనే దానిపై స్కూల్ నిర్వాహకులతో చర్చించాలి.
(8 / 10)
స్కూల్‌కు వెళ్లే విద్యార్థులకు ఇన్సులిన్, గ్లూకోగాన్, ఆహారం, నీరు ఎక్కడ నిలువ వుంచాలి.
విద్యార్థి బ్లడ్ గ్లూకోజ్, యూరిన్ కీటోన్ పరీక్షలు ఎప్పుడు చేసుకోవాలి? స్వయంగా చేసుకోలేకపోతే ఎవరు తోడ్పడాలనే దానిపై అవగాహన కల్పించాలి. రక్త పరీక్షలు ఎక్కడ చేసుకోవాలి, రక్తంలో షుగర్ తక్కువైతే లక్షణాలు ఎలావుంటాయి? ఎక్కువైతే ఏ లక్షణాలు వుంటాయో పిల్లలకు అర్థమయ్యేలా వివరించాలి.
(9 / 10)
విద్యార్ధి తన పరిస్థితిని స్వయంగా గుర్తించలేకపోతే, దానిని ఎవరు గుర్తించాలనే విషయంలో ముందే తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసర చికిత్సకు అవసరమైన గ్లూకోజ్, గ్లూకగాన్, మందులు, నీరు, ఆహార పదార్ధాలు అందుబాటులో ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసర సమయాల్లో ఏం చెయ్యాలి? ఎవరెవరిని ఫోన్ ద్వారా సంప్రదించాలి? ఎవరెవరికి తెలియజేయాలనే వివరాలు డైరీలో అందుబాటులో ఉంచడంతో పాటు టీచర్లకు ముందే సూచించాలి.
(10 / 10)
ఆరోగ్యకరమైన జీవన విధానంతో డయాబెటిస్ సమస్యను అధిగమించడంపై విద్యార్థుల్లో టైప్1, టైప్2 మధుమేహ బాధితుల్లో అవగాహన కల్పించాలి.
ఇతర గ్యాలరీలు