TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై బిగ్ అప్డేట్ - గ్రామ సభల్లో 2 రకాల జాబితాలు..! తాజా నిర్ణయాలివే
- TG Indiramma Housing Scheme Updates : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చేసింది. గ్రామసభల్లో రెండు రకాల జాబితాలను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు గృహా నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాలెంటో ఇక్కడ చూడండి….
- TG Indiramma Housing Scheme Updates : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చేసింది. గ్రామసభల్లో రెండు రకాల జాబితాలను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు గృహా నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాలెంటో ఇక్కడ చూడండి….
(1 / 8)
ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ నెలాఖారులోగా ఇళ్ల మంజూరు ప్రక్రియ ఉండనుంది. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి ప్రకటన చేశారు.
(2 / 8)
ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన జాబితాలను గ్రామసభల్లో పెట్టాలని సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే యాప్ సర్వేతో పాటు ఇందిరమ్మ కమిటీల సాయంతో ఈ పేర్లను ఖరారు చేయనుంది.
(3 / 8)
అయితే గ్రామసభల్లో రెండు రకాల జాబితాలను ప్రదర్శించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర గృహా నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
(4 / 8)
ఇంటి స్థలం ఉన్న వారి జాబితతో పాటు ఇంటి స్థలం లేని వారి జాబితాలను కూడా గ్రామ సభల్లో ప్రదర్శించాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
(5 / 8)
రెండు జాబితాలతో పాటు ప్రభుత్వం మరో నిర్ణయం కూడా తీసుకుంది. కొత్తగా గ్రామ సభలలో వచ్చే దరఖాస్తులను కూడా పరిశీలించాలని అధికారులకు సూచించింది. దీంతో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని వారు కూడా… అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉండనుంది.
(6 / 8)
ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు తెలంగా వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించనున్నారు. ఈ సభల్లోనే ఇందిరమ్మ ఇళ్ల జాబితాలపై చర్చించనున్నారు. అర్హులైన వారి జాబితాలకు గ్రామసభలో ఆమోదం తెలుపుతారు.
(7 / 8)
గ్రామసభల్లో ఫైనల్ చేసే జాబితాలకు జిల్లాల ఇంఛార్జీ మంత్రులు ఆమోదం తెలుపుతారు. ఈ లిస్టులు కలెక్టర్ల వద్దకు చేరుతాయి. జిల్లా కలెక్టర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే జాబితాలు విడుదలవుతాయి.వీరే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు అవుతారు.
(8 / 8)
తొలి విడతలో సొంత స్థలం ఉన్న నిరు పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది. ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున నిధులను విడుదల చేస్తారు. ఈ నిధులను నాలుగు ధపాలుగా జమ చేయనున్నారు. ఇందిరమ్మ ఇంటి ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేక వెబ్ సైట్(. https://indirammaindlu.telangana.gov.in ) కూడా అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు.
ఇతర గ్యాలరీలు