టీవీ షో జడ్జ్ అర్చనకు కోడలు కానున్న హీరోయిన్.. ఆమె సినిమాకు 300 కోట్ల కలెక్షన్స్.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?-tv show judge archana puran singh daughter in law yogita bihani glamour photos and movies list ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  టీవీ షో జడ్జ్ అర్చనకు కోడలు కానున్న హీరోయిన్.. ఆమె సినిమాకు 300 కోట్ల కలెక్షన్స్.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

టీవీ షో జడ్జ్ అర్చనకు కోడలు కానున్న హీరోయిన్.. ఆమె సినిమాకు 300 కోట్ల కలెక్షన్స్.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

Published Aug 16, 2025 02:30 PM IST Sanjiv Kumar
Published Aug 16, 2025 02:30 PM IST

టీవీ షో జడ్జ్ అర్చనకు కోడలుగా బాలీవుడ్ హీరోయిన్ కానుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ హీరోయిన్ నటించిన సినిమా ఏకంగా రూ. 300 కోట్ల కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. అయితే, ఆ సినిమా వివాదం కూడా సృష్టింది. మరి వార్ 2 హీరో హృతిక్ రోషన్‌తో నటించిన ఆ హీరోయిన్ ఎవరో ఇక్కడో తెలుసుకోండి.

బాలీవుడ్ నటి, 'ది కపిల్ శర్మ షో' జడ్జి అర్చన పూరన్ సింగ్, పర్మీత్ సేథీ ఇంట్లో ఇప్పుడు సంతోషకరమైన వాతావరణం నెలకొంది. అర్చన ఒక అందమైన హీరోయిన్‌కు అత్త కాబోవడమే దీనికి కారణం.

(1 / 8)

ఇటీవల టీవీ షో జడ్జ్ అర్చన కుమారుడు ఆర్యమన్ సేథీ తన గర్ల్‌ఫ్రెండ్, బాలీవుడ్ హీరోయిన్ యోగితా బిహానీతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ అందమైన క్షణాన్ని చూసి అర్చన కన్నీళ్లు ఆపుకోలేక భావోద్వేగానికి గురయ్యారు.

(2 / 8)

అయితే, ఇప్పుడు అర్చనకు కాబోయే కోడలు యోగిత ఎవరు అనే ప్రశ్న బాలీవుడ్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. అయితే, యోగితా బిహానీ బాలీవుడ్‌లో సుపరిచితమైన నటి అని తెలిసిందే.

(3 / 8)

యోగితా బిహానీ తన కెరీర్‌ను మోడలింగ్, టీవీతో ప్రారంభించింది. కానీ ఆమెకు నిజమైన గుర్తింపు మాత్రం సూపర్ హిట్ చిత్రం 'ది కేరళ స్టోరీ'తో వచ్చింది. ఈ సినిమా ఏకంగా రూ. 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

(4 / 8)

యోగితా బిహానీ ఆగస్టు 7, 1995న బికానెర్‌లో జన్మించింది, ఢిల్లీలో పెరిగింది. ఆమె ఢిల్లీ యూనివర్సిటీ నుండి కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ పొందింది. చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టడానికి ముందు 2016 వరకు ఫరీదాబాద్‌లోని రెడ్‌ఫుడీ స్టార్టప్‌లో పనిచేసింది.

(5 / 8)

2018లో, యోగితా ఫెమినా మిస్ ఇండియా రాజస్థాన్ టాప్ 3 పోటీదారులలో ఒకరు. అదే సంవత్సరం, సల్మాన్ ఖాన్‌తో కలిసి 'దస్ కా దమ్' ప్రోమో షూటింగ్ సమయంలో ఏక్తా కపూర్ ఆమెను చూసింది. ఆ తర్వాత ఆమెకు "దిల్ హీ తో హై" టీవీ షోలో కరణ్ కుంద్రా సరసన ప్రధాన పాత్ర లభించింది.

(6 / 8)

2019లో, యోగితా "కవచ్.. మహాశివరాత్రి"లో నటించింది. ఆమె సినీ కెరీర్ 2020లో అనిల్ కపూర్, అనురాగ్ కశ్యప్ చిత్రం AK vs AKతో యోగితా సినీ కెరీర్ ప్రారంభమైంది. అనంతరం 2022లో, ఆమె హృతిక్ రోషన్‌తో కలిసి విక్రమ్ వేధా హిందీ రీమేక్‌లో నటించింది. ఇక యోగితా నటించిన చివరి చిత్రం 2023లో వచ్చిన ది కేరళ స్టోరీ వివాదస్పదమైంది. ఇందులో హీరోయిన్‌గా అదా శర్మ చేసిన విషయం తెలిసిందే.

(7 / 8)

యోగితా బిహానీ.. స్టెబిన్ బెన్ 'ఇష్క్ కా అసర్'తో పాటు కపిల్ శర్మ, గురు రంధావా మ్యూజిక్ వీడియో 'అలోన్'లో కూడా నటించింది. అంతే కాదు, ఆమె తన కాబోయే భర్త ఆర్యమన్ సెథీ మ్యూజిక్ వీడియో 'ఛోటీ బాతే ఔర్ మధుబాల'లో కూడా యోగితా దర్శనం ఇచ్చింది.

(8 / 8)

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు