Telugu News  /  Photo Gallery  /  Turkey Earthquake Syria Earthquake Over 2300 Killed Thousand Of Buildings Collapsed Pictures

Turkey Earthquakes: భూకంప బీభత్సం.. టర్కీ, సిరియా ధ్వంసం: 2,300 మందికిపైగా మృతి: కుప్పకూలిన వేలాది ఇళ్లు: ఫొటోలు

06 February 2023, 20:49 IST Chatakonda Krishna Prakash
06 February 2023, 20:49 , IST

Turkey Earthquakes: భూకంపాల బీభత్సానికి టర్కీ (Turkey), సిరియా (Syria Earthquakes) దేశాల్లోని చాలా నగరాలు ధ్వంసం అయ్యాయి. సోమవారం (ఫిబ్రవరి 6) సంభవించిన తీవ్రమైన భూకంపాలతో ఆ రెండు దేశాల్లో అపార నష్టం జరిగింది. వేలాది భవనాలు కుప్పకూలాయి. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 2,300 దాటింది. వేలాది మంది ఇంకా శిథిలాల కిందే చిక్కుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున టర్కీలోని గజియాన్‍టెప్ (Gaziantep) కేంద్రంగా 7.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో టర్కీతో పాటు సమీపంలోని సిరియా దేశం కూడా తీవ్రంగా దెబ్బతింది. గంటల వ్యవధిలోనే మరో రెండుసార్లు టర్కీలో భూకంపం సంభవించింది. ఇరు దేశాల్లో వేలాది మంది బాధితులయ్యారు.

Turkey Earthquakes: సిరియాలోని ఇడ్‍లిబ్‍లో సహాయక చర్యలు జరుగుతున్న దృశ్యం. బుల్డోజర్లతో శిథిలాలను తొలగిస్తూ శిథిలాల కింద చిక్కుకున్న బాధితులను వెలికి తీస్తున్న డిఫెన్స్ సిబ్బంది. 

(1 / 10)

Turkey Earthquakes: సిరియాలోని ఇడ్‍లిబ్‍లో సహాయక చర్యలు జరుగుతున్న దృశ్యం. బుల్డోజర్లతో శిథిలాలను తొలగిస్తూ శిథిలాల కింద చిక్కుకున్న బాధితులను వెలికి తీస్తున్న డిఫెన్స్ సిబ్బంది. (AFP)

భూకంప తీవ్రతకు నేలమట్టమైన భవనాలు.

(2 / 10)

భూకంప తీవ్రతకు నేలమట్టమైన భవనాలు.(AP)

టర్కీలోని దియార్బాకిర్ సిటీలో శిథిలాల కింద ఉన్న తమ వారి కోసం నిరీక్షిస్తున్న ప్రజలు.

(3 / 10)

టర్కీలోని దియార్బాకిర్ సిటీలో శిథిలాల కింద ఉన్న తమ వారి కోసం నిరీక్షిస్తున్న ప్రజలు.(REUTERS)

టర్కీలోని పజార్సిక్ నగరంలో కుప్పకూలిన భవనం. 

(4 / 10)

టర్కీలోని పజార్సిక్ నగరంలో కుప్పకూలిన భవనం. (AP)

పూర్తిగా కుప్పకూలిన భవనం ముందు గుమికూడిన ప్రజలు. 

(5 / 10)

పూర్తిగా కుప్పకూలిన భవనం ముందు గుమికూడిన ప్రజలు. (AFP)

గాయపడిన వారిని ఆంబులెన్స్‌లో తరలిస్తున్న దృశ్యం.

(6 / 10)

గాయపడిన వారిని ఆంబులెన్స్‌లో తరలిస్తున్న దృశ్యం.(REUTERS)

శిథిలాల కింది నుంచి ఓ వ్యక్తిని బయటికి తీస్తున్న సహాయక సిబ్బంది, ప్రజలు.

(7 / 10)

శిథిలాల కింది నుంచి ఓ వ్యక్తిని బయటికి తీస్తున్న సహాయక సిబ్బంది, ప్రజలు.(REUTERS)

సిరియాలోని ఇబ్‍లిబ్‍లో సహాయక చర్యలు చేస్తున్న సివిల్ డిఫెన్స్ సిబ్బంది.

(8 / 10)

సిరియాలోని ఇబ్‍లిబ్‍లో సహాయక చర్యలు చేస్తున్న సివిల్ డిఫెన్స్ సిబ్బంది.(AFP)

శిథిలాల కింద చిక్కుకున్న తమ వారి కోసం ప్రజలు అన్వేషిస్తున్న దృశ్యం 

(9 / 10)

శిథిలాల కింద చిక్కుకున్న తమ వారి కోసం ప్రజలు అన్వేషిస్తున్న దృశ్యం (AFP)

భూకంపం వల్ల టర్కీలోని మలత్యాలో తీవ్రంగా ధ్వంసమైన ఓ మసీదు.

(10 / 10)

భూకంపం వల్ల టర్కీలోని మలత్యాలో తీవ్రంగా ధ్వంసమైన ఓ మసీదు.(AP)

ఇతర గ్యాలరీలు