TSRTC New Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపట్నుంచే ఏసీ స్లీపర్ బస్సులు ప్రారంభం-tsrtc to launch new ac sleeper buses on 27 march 2023 check full details are here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Tsrtc To Launch New Ac Sleeper Buses On 27 March 2023 Check Full Details Are Here

TSRTC New Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపట్నుంచే ఏసీ స్లీపర్ బస్సులు ప్రారంభం

Mar 26, 2023, 01:06 PM IST HT Telugu Desk
Mar 26, 2023, 01:06 PM , IST

TSRTC New AC Sleeper Buses: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. కొత్తగా 16 ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, కర్ణాటకలోని బెంగళూరు, హుబ్బళ్లి, తమిళనాడులోని చెన్నై నగరాలకు ఈ బస్సులను నడిపుతారు. ఆ మేరకు ఆర్టీసీ యాజమాన్యం వివరాలను ప్రకటించింది.

మార్చి 27న(సోమవారం) ఈ ఏపీ బస్సులను ఆర్టీసీ ప్రారంభించనుంది. రాష్ట్రంలో తొలిసారిగా వీటిని వాడుకలోకి తీసుకువస్తోంది. ఉదయం ఉదయం 9.30 గంటలకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఈ బస్సులను ప్రారంభిస్తారని ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. 

(1 / 5)

మార్చి 27న(సోమవారం) ఈ ఏపీ బస్సులను ఆర్టీసీ ప్రారంభించనుంది. రాష్ట్రంలో తొలిసారిగా వీటిని వాడుకలోకి తీసుకువస్తోంది. ఉదయం ఉదయం 9.30 గంటలకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఈ బస్సులను ప్రారంభిస్తారని ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. (twitter)

ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించేందుకు రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ ఏసీ స్లీపర్ బస్సులను తీసుకచ్చింది ఆర్టీసీ. హైటెక్ హంగులతో ఏసీ స్లీపర్ బస్సులను రూపొందించారు. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే ఏసీ స్లీపర్ బస్సులకు లహరిగా సంస్థ నామకరణం చేసింది.

(2 / 5)

ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించేందుకు రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ ఏసీ స్లీపర్ బస్సులను తీసుకచ్చింది ఆర్టీసీ. హైటెక్ హంగులతో ఏసీ స్లీపర్ బస్సులను రూపొందించారు. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే ఏసీ స్లీపర్ బస్సులకు లహరిగా సంస్థ నామకరణం చేసింది.(twitter)

కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ... ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, తిరుపతి.... తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ బస్సులు నడుస్తాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువ అయ్యేందుకు హైటెక్ హంగులతో ఈ బస్సులను తీసుకువచ్చారు.

(3 / 5)

కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ... ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, తిరుపతి.... తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ బస్సులు నడుస్తాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువ అయ్యేందుకు హైటెక్ హంగులతో ఈ బస్సులను తీసుకువచ్చారు.(twitter)

12 మీటర్ల పొడవు గల ఏసీ స్లీపర్ బస్సుల్లో లోయర్‌ 15, అప్పర్ 15తో 30 బెర్తుల సామర్థ్యం ఉంది. బెర్త్ ల వద్ద వాటర్ బాటిల్ పెట్టుకునే సదుపాయంతో పాటు మొబైల్ చార్జింగ్ సౌకర్యం ఉంటుంది. ప్రతి బెర్త్‌ వద్ద రీడిండ్‌ ల్యాంప్‌ లను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఏసీ స్లీపర్‌ బస్సుల్లో వెహికిల్‌ ట్రాకింగ్‌ సిస్టంతో పాటు పానిక్‌ బటన్‌ సదుపాయం కల్పించారు. వాటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూంనకు అనుసంధానం చేయడం జరుగుతుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఏసీ స్లీపర్‌ బస్సుల్లో వైఫై సదుపాయాన్ని కల్పించారు. ప్రతి బస్సులోనూ రెండు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

(4 / 5)

12 మీటర్ల పొడవు గల ఏసీ స్లీపర్ బస్సుల్లో లోయర్‌ 15, అప్పర్ 15తో 30 బెర్తుల సామర్థ్యం ఉంది. బెర్త్ ల వద్ద వాటర్ బాటిల్ పెట్టుకునే సదుపాయంతో పాటు మొబైల్ చార్జింగ్ సౌకర్యం ఉంటుంది. ప్రతి బెర్త్‌ వద్ద రీడిండ్‌ ల్యాంప్‌ లను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఏసీ స్లీపర్‌ బస్సుల్లో వెహికిల్‌ ట్రాకింగ్‌ సిస్టంతో పాటు పానిక్‌ బటన్‌ సదుపాయం కల్పించారు. వాటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూంనకు అనుసంధానం చేయడం జరుగుతుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఏసీ స్లీపర్‌ బస్సుల్లో వైఫై సదుపాయాన్ని కల్పించారు. ప్రతి బస్సులోనూ రెండు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.(twitter)

బస్సు రివర్స్‌ చేసేందుకు వీలుగా రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా ఉంటుంది. బస్సుకు ముందు వెనక ఎల్ఈడీ బోర్డులుంటాయి. అందులో గమ్యస్థానాల వివరాలు కనిసిప్తాయి. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్‌)ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం బస్సుల్లో ఉంటుంది. మరోవైపు ఆర్టీసీ అధికారుల చర్యలతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

(5 / 5)

బస్సు రివర్స్‌ చేసేందుకు వీలుగా రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా ఉంటుంది. బస్సుకు ముందు వెనక ఎల్ఈడీ బోర్డులుంటాయి. అందులో గమ్యస్థానాల వివరాలు కనిసిప్తాయి. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్‌)ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం బస్సుల్లో ఉంటుంది. మరోవైపు ఆర్టీసీ అధికారుల చర్యలతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. (twitter)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు