TSPSC Group 4 Updates : గ్రూప్ 4 అభ్యర్థులకు అలర్ట్.... టీఎస్పీఎస్సీ తాజా ప్రకటన ఇదే-tspsc has started the exercise on certificate verification of group 4 candidates latest updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tspsc Group 4 Updates : గ్రూప్ 4 అభ్యర్థులకు అలర్ట్.... టీఎస్పీఎస్సీ తాజా ప్రకటన ఇదే

TSPSC Group 4 Updates : గ్రూప్ 4 అభ్యర్థులకు అలర్ట్.... టీఎస్పీఎస్సీ తాజా ప్రకటన ఇదే

Published May 17, 2024 06:55 PM IST Maheshwaram Mahendra Chary
Published May 17, 2024 06:55 PM IST

  • TSPSC Group 4 Jobs Updates : లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగియటంతో ఉద్యోగాల భర్తీపై TSPSC ఫోకస్ పెట్టింది. త్వరలోనే గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది. గ్రూప్ 4 రిక్రూట్మెంట్ కు సంబంధించిన తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి…..

ఉద్యోగాల భర్తీపై TSPSC ఫోకస్ పెట్టింది. త్వరలోనే గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది. 

(1 / 5)

(https://www.tspsc.gov.in/)

గ్రూప్-4 నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 8,180 ఉద్యోగాల భ‌ర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం 7,26,837 మంది ర్యాంకులను(జనరల్ ర్యాంకింగ్) ప్రకటించింది టీఎస్పీఎస్సీ. 

(2 / 5)

జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను ప్రకటించగా…. సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసేందుకు కమిషన్ కసరత్తు చేస్తోంది.  జనరల్ అభ్యర్థులను 1:3 గా పిలవనుంది.ఇక పీడ‌బ్ల్యూడీ అభ్యర్థులను 1:5 చొప్పున ఎంపిక చేసి లిస్ట్ ను రూపొందించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది.

(3 / 5)

త్వరలోనే వెరిఫికేష‌న్ తేదీలను వెబ్ సైట్ లో ఉంచనున్నట్లు కమిషన్ తెలిపింది.ఈ మేరకు మే 17వ తేదీన ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందుకోసం అభ్యర్థులు అన్ని ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించింది.

(4 / 5)

కమ్యూనిటీ, నాన్ క్రిమిలేయర్ తో పాటు  స్టడీ సర్టిఫికేట్స్ తో పాటు విద్యా అర్హత పత్రాలను సిద్ధం చేసి ఉంచుకోవాలని కమిషన్ సూచించింది. వెబ్ సైట్ లో కమిషన్ సూచించిన పత్రాలను మిస్ కాకుండా చూసుకోవాలని…. ఏ ఒక్కటి లేకపోయినా ఆయా అభ్యర్థులను పక్కనపెడతారని తెలిపింది. ఏ క్షణమైనా….సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ప్రకటించే ఛాన్స్ ఉంది.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు