తెలుగు న్యూస్ / ఫోటో /
TSPSC Group 2 Hall Tickets : తెలంగాణ గ్రూప్ 2 హాల్ టికెట్లు వచ్చేశాయ్, డౌన్ లోడ్ లింక్ ఇదే
TSPSC Group 2 Hall Tickets :తెలంగాణ గ్రూప్ 2 హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. టీజీపీఎస్సీ గ్రూప్2 హాల్ టికెట్ల లింక్ ను యాక్టివేట్ చేసింది. అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 15, 16 తేదీల్లో గ్రూప్ 2 రాత పరీక్షలు నిర్వహించనున్నారు.
(1 / 6)
తెలంగాణ గ్రూప్ 2 హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. టీజీపీఎస్సీ గ్రూప్2 హాల్ టికెట్ల లింక్ ను యాక్టివేట్ చేసింది. అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 15, 16 తేదీల్లో గ్రూప్ 2 రాత పరీక్షలు నిర్వహించనున్నారు.
(2 / 6)
తెలంగాణ గ్రూప్ 2 పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) రాష్ట్ర వ్యాప్తంగా 1368 ఎగ్జామ్ సెంటర్ లలో నిర్వహించనున్నారు. హాల్ టికెట్లు నేటి నుంచి(డిసెంబర్ 9) డౌన్‌లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. హాల్ టికెట్లు ఈ నెల 15వ తేదీ ఉదయం 9 గంటల వరకు కమిషన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
(3 / 6)
గ్రూప్ 2 అభ్యర్థులను ఉదయం సెషన్ లో 08:30 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9.30 గేట్లు మూసివేస్తారు. మధ్యాహ్నం సెషన్ కోసం 1:30 నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 2:30 తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
(4 / 6)
పరీక్షకు నలుపు / నీలం బాల్ పాయింట్ పెన్నులు, హాల్ టికెట్ మాత్రమే తీసుకెళ్లాలి. హాల్ టికెట్ పై లేటెస్ట్ ఫోటో అతికించాలి. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒరిజినల్ ఫోటో ఐడీ కార్డు తనిఖీల సమయంలో చూపించాలి. అభ్యర్థి ఫొటోగ్రాఫ్, హాల్ టికెట్ ఉన్న ఫొటో ఒకటై ఉండాలి.
(5 / 6)
హాల్ టికెట్ పై ఫొటో సరిగ్గా లేకపోతే కమిషన్ వెబ్ సైట్ లోని అండర్ టేకింగ్ ఫామ్ డౌన్ లోడ్ చేసుకుని, మూడు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలను అతికించి, చివరిగా చదివిన విద్యాసంస్థలో గెజిటెడ్ చేయించాలి. వాటిని ఇన్విజిలేటర్‌కు సమర్పించాలి.
(6 / 6)
అభ్యర్థులు పరీక్ష కేంద్రాన్ని ఒక రోజు ముందుగా చెక్ చేసుకోవాలి. చివరి క్షణంలో వేరే పరీక్ష కేంద్రాలకు వెళ్లి ఇబ్బందులు పడకుండా ముందుగానే ధ్రువీకరించుకోవాలి. అభ్యర్థులు కాలిక్యులేటర్లు, పేజర్లు, సెల్ ఫోన్లు, టాబ్లెట్లు, డ్రైవ్‌లు, బ్లూటూత్ పరికరాలు, వాచ్, వాలెట్, హ్యాండ్‌బ్యాగ్‌లు, పర్సులు, రైటింగ్ ప్యాడ్‌లు, నోట్స్, చార్ట్‌లు, వదులుగా ఉండే షీట్‌లు, ఆభరణాలు (మంగళసూత్రం బ్యాంగిల్స్ & సంబంధిత వస్తువులు మినహా), ఏదైనా ఇతర గాడ్జెట్‌లు/ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, రికార్డింగ్ సాధనాలు తీసుకురావడానికి అనుమతి లేదు.
ఇతర గ్యాలరీలు