TS Inter Results 2025 : తెలంగాణ ఇంటర్ ఫలితాలపై అప్డేట్, ఈ నెల 25 లేదా 27 విడుదలయ్యే అవకాశం
TS Inter Results 2025 : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఈ నెల 25 లేదా 27న విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మార్చి 5 నుంచి 25 వరకు తెలంగాణ ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకం పూర్తి చేసి ఆన్ లైన్ లో మార్కులు ఫీడ్ చేశారు. ఈ నెల 20 నాటికి రీవెరిఫికేషన్ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.
(1 / 6)
ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇక తెలంగాణ ఇంటర్ విద్యార్థులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఫలితాల విడుదలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
(2 / 6)
తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఈ నెల 25 లేదా 27న విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మార్చి 5 నుంచి 25 వరకు తెలంగాణ ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 9.96 లక్షల మంది హాజరయ్యారు.
(3 / 6)
ఇప్పటికే తెలంగాణ ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకం పూర్తి చేసి ఆన్ లైన్ లో మార్కులు ఫీడ్ చేశారు. ఈ నెల 20 నాటికి రీవెరిఫికేషన్ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.
(4 / 6)
సమాధాన పత్రాల మూల్యాంకనం 19 కేంద్రాల్లో మార్చి 18 నుంచి చేపట్టారు. మొత్తంగా 60 లక్షల పేపర్లు మూల్యాంకనం చేసి ఆన్‌లైన్‌లో మార్కులు ఫీడ్ చేశారు. వీటిని రెండు సార్లు పరిశీలించిన తర్వాత తుది ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ ఏప్రిల్ 20తో పూర్తవుతుందని అధికారులు తెలిపారు.
(5 / 6)
ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://tgbie.cgg.gov.in/ ద్వారా అందుబాటులోకి తీసుకురానుంది. ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు.
ఇతర గ్యాలరీలు