Weightloss: బరువు తగ్గాలనుకుంటే వారం రోజుల పాటు ఈ డైట్ ట్రై చేయండి-try this diet for a week if you want to lose weight ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Weightloss: బరువు తగ్గాలనుకుంటే వారం రోజుల పాటు ఈ డైట్ ట్రై చేయండి

Weightloss: బరువు తగ్గాలనుకుంటే వారం రోజుల పాటు ఈ డైట్ ట్రై చేయండి

Published Jul 02, 2024 11:51 AM IST Haritha Chappa
Published Jul 02, 2024 11:51 AM IST

  • Weightloss: ఆధునిక కాలంలో ఎంతోమంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుండి బయటపడాలంటే వ్యాయామంతో పాటు డైట్ పై దృష్టి పెట్టాలి. వారంలో బరువు తగ్గాలనుకుంటే ఈ డైట్ ఫాలో అవ్వండి. 

వేగంగా బరువు తగ్గాలంటే ఈ వారం రోజుల పాటూ డైట్ ప్లాన్ ఫాలో అవ్వాలి. ఇలా చేయడం వల్ల చాలా బరువు త్వరగా తగ్గొచ్చు. ఈ డైట్ ఏంతో తెలుసుకోండి.

(1 / 8)

మీరు మొదటి రోజు అల్పాహారం కోసం ఓట్ మీల్ వండుకోవచ్చు. మధ్యాహ్న భోజనానికి ఏదైనా కూరగాయలు ఒక కప్పు,  కప్పు బ్రౌన్ రైస్, కప్పు సలాడ్ తీసుకోవాలి. సాయంత్రం గ్రీన్ టీ తాగండి.  గుప్పెడు నానబెట్టిన బాదం పప్పు తినండి. రాత్రి భోజనానికి పెరుగు, 200 గ్రాముల వండిన కూరగాయలు,  క్వినోవా తీసుకోవాలి. 

(2 / 8)

రెండో రోజు బ్రేక్ ఫాస్ట్ కు 100 గ్రాముల సాంబార్, 20 గ్రాముల టమోటా పచ్చడి, 100 గ్రాముల ఇడ్లీ, ఒక గ్లాసు మజ్జిగ తీసుకోవాలి. మధ్యాహ్న భోజనానికి 100 గ్రాముల మిశ్రమ కూరగాయలు, 100 గ్రాముల గ్రీన్ సలాడ్,  రెండు రోటీలు తినండి. సాయంత్రం ఒక కప్పు పెరుగులో కొన్ని అవిసె గింజల పొడిని కలిపి తినాలి. రాత్రి భోజనానికి 50 గ్రాముల పనీర్ టిక్కా, కప్పు బ్రౌన్ రైస్ తినాలి.

(3 / 8)

మూడో రోజు అల్పాహారంలో ఒక చిన్న ప్లేట్ వెజిటబుల్ పోహా, ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తీసుకోవాలి. లంచ్ కు ఒక కప్పు వెజిటబుల్ దాల్ సాంబార్, రెండు చపాతీలు,  సలాడ్ తినాలి.  సాయంత్రం గ్రీన్ టీతో 20 గ్రాముల నానబెట్టిన వాల్ నట్స్ తినాలి. రాత్రి భోజనం కోసం 100 గ్రాముల పెరుగు, 100 గ్రాముల క్వినోవాతో పాటు 100 గ్రాముల వండిన కూరగాయలు తినండి. 

(4 / 8)

నాలుగో రోజు అల్పాహారానికి 100 గ్రాముల ఓట్ చిల్లా తినాలి. మధ్యాహ్న భోజనానికి 100 గ్రాముల పాలకూర, సోయాబీన్ కూరగాయలు, రెండు చపాతీలు, 100 గ్రాముల సలాడ్ తినాలి. సాయంత్రం ఒక కప్పు గ్రీన్ టీలో నానబెట్టిన గుప్పెడు బాదం పప్పులు తినాలి. రాత్రి భోజనానికి 100 గ్రాముల తేలికగా ఉడికించిన కూరగాయలతో ఒక చిన్న గిన్నె క్వినోవా వండుకుని తినాలి. 

(5 / 8)

5వ రోజు అల్పాహారానికి రెండు చపాతీ, కూర, నానబెట్టిన పప్పులు తీసుకోవాలి. సాయంత్రం ఒక కప్పు పెరుగులో కొద్దిగా అవిసె గింజల పొడి వేసి తాగాలి. రాత్రి భోజనానికి 200 గ్రాముల ఉడికించిన కూరగాయలు, 30 గ్రాముల బ్రౌన్ రైస్, 50 గ్రాముల గ్రిల్డ్ చీజ్ తీసుకోవాలి.

(6 / 8)

ఆరో రోజు అల్పాహారానికి గంజి, మజ్జిగ వంటివి తాగాలి. మధ్యాహ్న భోజనానికి రెండు చపాతీలు, 100 గ్రాముల కూరగాయలతో సలాడ్ తీసుకోవాలి. సాయంత్రం 1 కప్పు పెరుగులో కొద్దిగా అవిసె గింజల పొడి వేసి తినవచ్చు. రాత్రి భోజనానికి 100 గ్రాముల ఉడికించిన కూరగాయలు, 30 గ్రాముల బ్రౌన్ రైస్, 75 గ్రాముల పప్పు తినండి. 

(7 / 8)

ఏడవ రోజు చట్నీతో ఒక సాదా గోధుమ దోశ తినాలి, అలాగే ఒక గ్లాసు తాజా పండ్ల రసం తాగాలి. మధ్యాహ్న భోజనానికి ఒక కప్పు దాల్ తడ్కా, రెండు గోధుమ రోటీ, 100 గ్రాముల సలాడ్ తినాలి. సాయంత్రం ఒక కప్పు గ్రీన్ టీలో నానబెట్టిన 20 గ్రాముల వాల్ నట్స్, రాత్రి భోజనానికి కొద్దిగా ఉడికించిన కూరగాయలు, ఒక చిన్న గిన్నె క్వినోవా తీసుకోవాలి.

(8 / 8)

ఇతర గ్యాలరీలు