(1 / 6)
యానిమల్ చిత్రంలో జోయా పాత్రలో యంగ్ బ్యూటీ తృప్తి డిమ్రి నటించింది. ఈ సినిమాలో ఆమె గ్లామరస్‍గా, హాట్ లుక్‍తో అదరగొట్టింది.
(2 / 6)
యానిమల్ మూవీలో హీరో రణ్‍బీర్, తృప్తి మధ్య కెమెస్ట్రీ బాగా పండింది. వీరి మధ్య రొమాంటిక్ సీన్లు హైలైట్‍గా నిలిచాయి. తన గ్లామర్, హాట్‍నెస్‍తో కుర్రాళ్ల మదిని ఈ ముద్దుగుమ్మ దోచేసుకుంది.
(3 / 6)
యానిమల్ సినిమాతో తృప్తి ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. సోషల్ మీడియాలో ఆమె ట్రెండ్ అవుతున్నారు. ఈ చిత్రంలో గ్లామరస్ లుక్‍తో అందరినీ ఈ యంగ్ బ్యూటీ ఆకర్షించింది. ఈ చిత్రం చూసిన చాలా మంది ఎవరీ తృప్తి అని ఇంటర్నెట్‍లో తెగ వెతికేస్తున్నారు.
(4 / 6)
2017లో బాలీవుడ్‍లో పోస్టర్ బాయ్ చిత్రంతో తృప్తి డిమ్రి తెరంగేట్రం చేసింది. లైలా మజ్నులో హీరోయిన్‍గా మారింది. ఆ తర్వాత బుల్‍బుల్, ఖాలా అనే మరో రెండు సినిమాల్లో కనిపించినా అంతగా ఫేమస్ కాలేదు. ఇక, తాజాగా యానిమల్ సినిమాతో
ఒక్కసారిగా పాపులర్ అయింది.
(5 / 6)
1994లో ఉత్తరాఖండ్‍లో తృప్తి డిమ్రి జన్మించింది. యానిమల్ సూపర్ సక్సెస్‍తో డిమ్రికి సినిమా అవకాశాలు వెల్లువలా వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే మరో రెండు బాలీవుడ్ చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి.
(6 / 6)
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా ఇప్పటి వరకు మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.356కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. జోరు కొనసాగే అవకాశం ఉంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న మెయిన్ హీరోయిన్‍గా నటించారు.
ఇతర గ్యాలరీలు