Araku Chali Jatara : వైభవంగా అరకులోయ చలి జాతర.. 10 రాష్ట్రాలకు చెందిన గిరిజన కళాకారుల నృత్యాలు
- Araku Chali Jatara : ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకు లోయలో చలి జాతరను వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలు గొప్ప అనుభూతిని ఇచ్చాయని పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా కలెక్టర్ దినేష్ కుమార్ మినీ మారథాన్ 5కే రన్ ప్రారంభించారు.

(1 / 7)
అరకులోయ చలి జాతర వైభవంగా ప్రారంభం అయింది. 10 రాష్ట్రాలకు చెందిన గిరిజన కళాకారుల నృత్యాలు, సాంప్రదాయ డప్పు వాయిద్యాలతో ఆకట్టుకున్నారు.
(2 / 7)
ప్రకృతి అందాలకు పెట్టింది పేరు అరకులోయ. ఇక్కడి చలి ఉత్సవాలు గిరిజన ఆచార, సంప్రదాయాలు ఉట్టిపడేలా జరగాయి. గిరిజనుల సంస్కృతి ప్రతిబింబించేలా అరకు చలి ఉత్సవం జరుగుతుంది.
(3 / 7)
అరకు లోయలోని డిగ్రీ కాలేజీ వేదికగా.. చలి ఉత్సవాన్ని శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. సందర్శకులను ఆకట్టుకునేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
(4 / 7)
హాట్ బెలూన్, పారాగ్లైడ్, హెలికాఫ్టర్ వంటి వాటిని ప్రైవేటు సంస్థలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీటిలో పర్యాటకులు, స్థానికులు విహరిస్తున్నారు.
(5 / 7)
పది రాష్ట్రాలకు చెందిన గిరిజన కళాకారుల నృత్యాలు, సంప్రదాయ డప్పు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫిబ్రవరి 2వ తేదీన సాయంత్రం 6 గంటలకు చలి జాతర ముగియనుంది.
(6 / 7)
అరకు మారథాన్, పద్మాపురం గార్డెన్‌లో ఫ్లవర్ షో, గిరిజన వంటకాల ఫుడ్ కోర్టు, గిరిజన ఉత్పత్తులతో స్టాల్స్ ఏర్పాటు చేశారు.
ఇతర గ్యాలరీలు