Trending Sleeve Designs: చీరలో మరింత అందంగా కనిపించాలంటే బ్లౌజ్ స్లీవ్స్‌ను ఇలా ట్రెండీగా కుట్టించుకోండి !-trending sleeve designs to look more beautiful in a saree stitch the blouse sleeves in this trendy way ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Trending Sleeve Designs: చీరలో మరింత అందంగా కనిపించాలంటే బ్లౌజ్ స్లీవ్స్‌ను ఇలా ట్రెండీగా కుట్టించుకోండి !

Trending Sleeve Designs: చీరలో మరింత అందంగా కనిపించాలంటే బ్లౌజ్ స్లీవ్స్‌ను ఇలా ట్రెండీగా కుట్టించుకోండి !

Published Feb 17, 2025 03:06 PM IST Ramya Sri Marka
Published Feb 17, 2025 03:06 PM IST

  • Trending Sleeve Designs: చీరలో మరింత అందంగా బ్లౌజ్‌తో పాటు స్లీవ్స్ కూడా ట్రెండీగా ఉండాలి. ఇక్కడున్న కొన్ని ట్రెండింగ్ స్లీవ్ డిజైన్లు మిమ్మల్ని అందరిలోనూ స్టైలీష్‌గా, ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి. ఎలాంటి చీరకైనా చక్కగా సూట్ అవుతాయి. అవేంటో ఓ లుక్కేయండి! 

ఎలాంటి చీరకైనా బ్లౌజ్ తోనే అందం వస్తుంది. కొన్నిసార్లు చీర ఖరీదైనది, అందమైనది కాకపోయినా మీరు వేసుకునే జాకెట్ దాని అందాన్ని పెంచుతుంది. కనుక బ్లౌజ్ కుట్టించుకోవడంలో కాస్త శ్రద్ద వహించాల్సి ఉంటుంది. కేవలం నెక్ భాగం మాత్రమే కాదు బ్లౌజ్ స్లీవ్ అంటే చేతులు కూడా మీ చీరను మిమ్మల్ని అందంగా, ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి. అలాంటి కొన్ని ట్రెండింగ్ స్టైలీష్ స్లీవ్ డిజైన్లు ఇక్కడ ఉన్నాయి. ఓ లుక్కేయండి.

(1 / 8)

(All Image Credit: @designerblouse58_Instagram)

క్లాసీ లుక్ ఇవ్వాలంటే స్లీవ్స్ డిజైన్ ను ఇలా ఉంచుకోవచ్చు.చేతులకు పైన భాగంలో కాస్త ఉబ్బినట్లుగా కనిపిస్తూ కింద పూసలు వేలాడుతున్న ఈ డిజైన్ స్లీవ్స్ ధరించడం వల్ల ఫ్యాన్సీ లుక్ మీ సొంతం అవుతుంది. 

(2 / 8)

ఈ లీఫ్ కట్ స్లీవ్ డిజైన్ సింపుల్ సారీలకు కూడా గ్రాండ్ లుక్‌ను ఇస్తుంది. పొడవు చేతులు కావాలనుకున్నా, పొట్టి చేతులు కావాలనుకున్నా ఇక్కడ కనిపిస్తున్నట్లుగా కుట్టించుకుంటే అందరిలోనూ అందంగా కనిపిస్తారు.

(3 / 8)

సింపుల్‌గా, క్లాసీగా కనిపించాలంటే ఈ స్లీవ్ డిజైన్ పర్ఫెక్ట్ ఆప్షన్. చేతుల పై భాగంలో చిన్న పఫ్, కింద భాగంలో మీకు నచ్చిన సింపుల్ లేస్‌తో ఇలా కుట్టించుకున్నారంటే అందరూ మీ టైలర్ అడ్రస్ అడగడం ఖాయం.

(4 / 8)

పఫ్ చేతులు ఎల్లప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటాయి. అంతేకాకుండా ఇవి అన్ని రకాల చీరలకు బాగా సెట్ అవుతాయి. మీరు కూడా ఇలా వింటేజ్ పఫ్ స్లీవ్ డిజైన్‌ను ఓ సారి ట్రై చేసి చూడండి. చూసినవారంతా మెచ్చుకుంటారు.

(5 / 8)

బ్లౌజ్ చేతులపై ఇలా డైమండ్ షేప్ కట్ డిజైన్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతోంది. ఈ కట్ మధ్యలో మీ నచ్చిన పువ్వులు, పూసలు, గొలుసులు వంటి రకరకాల డిజైన్లలో కుట్టించుకోవచ్చు. ఈ స్లీవ్ డిజైన్ చూడటానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. రోజూ వారి చీరల నుంచి పార్టీ వేర్ సారీస్ వరకూ అన్నింటికీ ఈ స్లీవ్స్ బాగా సెట్ అవుతాయి. 

(6 / 8)

క్రిస్ క్రాస్ ఆకారంలో ఉండే స్లీవ్‌ల డిజైన్ మీకు ఫ్యాన్సీ లుక్ ఇవ్వడానికి సహాయపడుతుంది. ఇది కాటన్, ఫ్యాబ్రిక్‌తో తయారు చేసిన బ్లౌజ్‌లకు అనుకూలంగా ఉంటుంది.ఈ డిజైన్ చాలా సొగసైనది కూడా.

(7 / 8)

ఈ రకం ఫ్రిల్డ్ డిజైన్ రోజువారీ చీరలకు అనుకూలంగా ఉంటుంది.ఇది చూడటానికి స్టైలిష్ గా ఉండటమే కాకుండా వేసుకున్నప్పుడు చాలా కంఫర్టబుల్ ఫీలింగ్ ఇస్తుంది.ఈ రకం స్లీవ్‌లు చిఫాన్, జార్జెట్ వంటి సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ చీరలకు బాగా సెట్ అవుతాయి.

(8 / 8)

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.
WhatsApp channel

ఇతర గ్యాలరీలు