TS To TG Number Plates : వాహనదారులకు అలర్ట్, టీఎస్ ను టీజీగా మారిస్తే లైసెన్స్ రద్దు!
TS To TG Number Plates : వాహనదారులకు తెలంగాణ రవాణా శాఖ కీలక సూచనలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నాటి నుంచి కొన్న కొత్త వాహనాలకు మాత్రమే టీజీ సిరీస్ వర్తిస్తుందని రవాణా శాఖ తెలిపింది. పాత వాహనాల నెంబర్ ప్లేట్లపై టీఎస్ ను టీజీగా మార్చిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
(1 / 6)
వాహనదారులకు తెలంగాణ రవాణా శాఖ కీలక సూచనలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర వాహన కోడ్ ను టీఎస్ నుంచి టీజీగా మార్పు చేసింది. ఈ మార్పునకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ఉత్తర్వులు జారీ అయి తర్వాత నుంచి కొత్త వాహనాలకు టీజీ నెంబర్ ప్లేట్ వస్తుంది.
(2 / 6)
ఇటీవల కాలంలో కొందరు వాహన నెంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేస్తున్నట్లు రవాణా శాఖ గుర్తించింది. పాత వాహనాల నెంబర్ పేట్లలలో మార్పులు చేస్తున్న వారికి రవాణా శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
(3 / 6)
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం టీఎస్ ను టీజీగా మారుస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో కొందరు వాహనదారులు తమ నెంబర్ ప్లేట్‌లలోని టీఎస్ అక్షరాలను టీజీగా మారుస్తున్నారు. ఈ వ్యవహారంపై రవాణా శాఖ అధికారులు తాజాగా స్పందించారు.
(4 / 6)
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నాటి నుంచి కొన్న కొత్త వాహనాలకు మాత్రమే టీజీ సిరీస్ వర్తిస్తుందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఎవరైనా వాహనదారులు పాత వాహనాల నెంబర్ ప్లేట్లపై రాష్ట్ర కోడ్ ను టీజీగా మార్చిస్తే ట్యాంపరింగ్ గా భావించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లైసెన్స్ రద్దు చేసే అవకాశం కూడా ఉందన్నారు.
(5 / 6)
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు వాహన రిజిస్ట్రేషన్ తో పాటు ఇతర సంస్థలకు తెలంగాణ స్టేట్(TS) అని పెట్టాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. టీఎస్ బదులుగా టీజీ పెట్టాలని అప్పట్లోనే అభిప్రాయం వ్యక్తం అయింది.
ఇతర గ్యాలరీలు