'రాజీవ్ యువ వికాసం' స్కీమ్ అప్డేట్స్ - జూన్ 10 నుంచి శిక్షణా కార్యక్రమాలు, ఆపై గ్రౌండింగ్-training programs for telangana rajiv yuva vikasam scheme beneficiaries from june 10 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  'రాజీవ్ యువ వికాసం' స్కీమ్ అప్డేట్స్ - జూన్ 10 నుంచి శిక్షణా కార్యక్రమాలు, ఆపై గ్రౌండింగ్

'రాజీవ్ యువ వికాసం' స్కీమ్ అప్డేట్స్ - జూన్ 10 నుంచి శిక్షణా కార్యక్రమాలు, ఆపై గ్రౌండింగ్

Published Jun 01, 2025 05:13 PM IST Maheshwaram Mahendra Chary
Published Jun 01, 2025 05:13 PM IST

తెలంగాణలో రాజీవ్ యువ వికాసం స్కీమ్ పట్టాలెక్కనుంది. జూన్ 2వ తేదీన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయనున్నారు. ఉపాధి యూనిట్ల గ్రౌండింగ్ కంటే ముందు లబ్ధిదారులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వివరాలు ఇక్కడ తెలుసుకోండి…

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ‌ర్గాల‌కు చెందిన‌ యువ‌కుల‌కు అండ‌గా నిలిచేందుకు తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం రాజీవ్ యువ వికాసం ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ప‌థ‌కాన్ని రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించ‌నుంది. లబ్ధిదారులకు శాంక్షన్ లెటర్లను అందజేయనుంది.

(1 / 7)

వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వం….. ఈ ఏడాదికి 5 ల‌క్ష‌ల మంది అర్హుల‌ను(లబ్ధిదారులను) ఎంపిక చేయ‌నుంది. దీని కోసం రూ.6,250 కోట్ల నిధుల‌ను కేటాయించింది. ఇందులో భాగంగా మొదటి విడతలో జూన్ 2న రూ.లక్షలోపు యూనిట్లకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలని ఇవ్వనుంది.

(2 / 7)

ఈ స్కీమ్ ను పకడ్బందీగా పట్టాలెక్కించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉపాధి యూనిట్లతో లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులుగా ఎంపికైన వారికి ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనుంది.

(3 / 7)

ముందుగా జూన్ 2 నుంచి 9వ తేదీ వ‌ర‌కు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంపికైన ల‌బ్ధిదారుల‌కు మంజూరు ప‌త్రాల‌ను అందిస్తారు. ఆ తర్వాత అంటే…. జూన్ 10 నుంచి 15 వ‌ర‌కు జిల్లా, నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో లబ్ధిదారులకు శిక్షణ‌ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. యూనిట్ల అమలుపై అవగాహన కల్పిస్తారు.

(4 / 7)

ల‌బ్ధిదారులు ఎంచుకున్న(యూనిట్లు) రంగంలో వారికి నైపుణ్యాలు మెరుగుప‌ర‌చ‌డానికి ప్ర‌భుత్వంతో ఎంప్యాన‌ల్ చేసుకున్న సంస్థ‌లు ఎంట్ర‌ప్రెన్యూరియ‌ల్‌షిప్‌ డెవ‌లెప్‌మెంట్ ట్రైనింగ్ ఇస్తాయి.

(5 / 7)

(image source istockphoto)

శిక్షణ పూర్తి అయిన తర్వాత... జూన్ 16 నుంచి 20 తేదీల్లో మధ్య సబ్సిడీ నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఇక జూన్ 21 నుంచి 30 తేదీల మధ్య గ్రౌండింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

(6 / 7)

మొదటి విడత పూర్తి కాగానే… మరో నాలుగు విడుతల్లో లబ్ధిదారులకు శాంక్షన్ లెటర్లను అందజేస్తారు. వీరికి  కూడా శిక్షణ ఉంటుంది. ఆ తర్వాతనే గ్రౌండింగ్ ప్రక్రియ చేస్తారు. ఈ స్కీమ్ లో మొత్తం నాలుగు కేటగిరిలు ఉన్న సంగతి తెలిసిందే. రూ. 50 వేల వ‌ర‌కు 100 శాతం రాయితీ ఉంటుంది. ఇక రూ. ల‌క్ష‌ల వ‌ర‌కు 90 శాతం, రూ.2 లక్ష‌ల వ‌ర‌కు 80 శాతం, రూ.4 ల‌క్ష‌ల వ‌ర‌కు శాతం స‌బ్సీడీ కింద రుణాలు మంజూరు చేయ‌నున్నారు. మొదటి విడతలో రూ. లక్ష ఉన్న యూనిట్లకు ప్రాధాన్యం ఇచ్చారు.

(7 / 7)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు