Revanth Reddy : అయ్య ఔరంగాబాద్, కొడుకు ప్లీనరీలో.. ఇది ప్రభుత్వమేనా అంటూ రేవంత్ ఫైర్-tpcc chief revanth reddy demands compensation to farmers for crop loss ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Revanth Reddy : అయ్య ఔరంగాబాద్, కొడుకు ప్లీనరీలో.. ఇది ప్రభుత్వమేనా అంటూ రేవంత్ ఫైర్

Revanth Reddy : అయ్య ఔరంగాబాద్, కొడుకు ప్లీనరీలో.. ఇది ప్రభుత్వమేనా అంటూ రేవంత్ ఫైర్

Published Apr 26, 2023 06:00 PM IST HT Telugu Desk
Published Apr 26, 2023 06:00 PM IST

  • Crop Damage in Telangana Due to Rains: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కామారెడ్డి జిల్లా పొందుర్తిలో పర్యటించిన ఆయన... దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఉమ్మడి ఏపీలో కంటే తెలంగాణలోనే అత్యధికంగా రైతులు  ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు రేవంత్ రెడ్డి. తొమ్మిదేళ్లలో రైతులు ఏ ఒక్క రోజు కూడా సంతోషంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ మోడల్ అంటే రైతుల ఆత్మహత్యలా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

(1 / 6)

బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు రేవంత్ రెడ్డి. ఈ నెపాన్ని కేసీఆర్  కేంద్రంపై నెట్టె ప్రయత్నం చేస్తున్నారని... కేంద్రం కొంటేనే కొంటామని అంటే.. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? అని సూటిగా నిలదీశారు.  

(2 / 6)

"రైతులు ఓట్లేస్తేనే కదా మీరు ముఖ్యమంత్రి అయ్యారు.. రైతుల ఓట్లతో గద్దెనెక్కి.. రైతుల గుండెలపై తన్నే ప్రయత్నం చేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ప్రతీ సంవత్సరం 1200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ వచ్చాక 2లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యలకు కారణం సీఎం కేసీఆర్" అని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  

(3 / 6)

సీఎం కేసీఆర్ రైతు హంతకుడని అన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. వడగళ్ల వానతో రైతులు పూర్తిగా నష్టపోయారని... ఈ పరిసర ప్రాంతాల్లో వెయ్యి ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. పంట నష్టం అంచనా వేసి.. ఎకరాకు 20వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

(4 / 6)

మామిడి తోటలకు ఎకరాకు 50వేలు నష్టపరిహారం అందించాలన్నారు రేవంత్ రెడ్డి. తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనాలన్న ఆయన... రైతుకు కావాల్సింది రైతు బీమా కాదు..  పంట బీమా అని చెప్పారు. పంట నష్టం పరిశీలించకుండా.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో దావత్ లు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు.

(5 / 6)

శాసనసభ్యులను క్షేత్ర స్థాయిలో అపర్యటనకు పంపాలని చెప్పారు రేవంత్ రెడ్డి. ఐఎఎస్ అధికారులను పంపి పంట నష్టాన్ని అంచనా వేయించాలని సూచించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై పోరాడతామని స్పష్టం చేశారు. ఇవాళ్టి నుంచి కాంగ్రెస్ నేతలు క్షేత్ర స్థాయిలో పర్యటించి పంట నష్టం పై నివేదికలు ఇస్తారని తెలిపారు. రైతులకు మనోధైర్యం కల్పిస్తామన్న రేవంత్ రెడ్డి... దయచేసి రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. 6 నెలల్లో వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు న్యాయం చేస్తామని హామీనిచ్చారు. 

(6 / 6)

ఇతర గ్యాలరీలు