Toyota Corolla Hybrid । SUV వాహానాల్లో తొలి క్రాస్ హైబ్రిడ్ వాహనం ఇదే!
- ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు టయోటా ఇటీవల 2023 టయోటా కరోలా క్రాస్ హైబ్రిడ్ SUVని ఆవిష్కరించింది. TNGA-C ప్లాట్‌ఫారమ్ ఆధారంగా, ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్‌తో ప్రత్యేకంగా రూపొందించిన ఈ వాహనం 15 kmpl కంటే ఎక్కువ మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
- ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు టయోటా ఇటీవల 2023 టయోటా కరోలా క్రాస్ హైబ్రిడ్ SUVని ఆవిష్కరించింది. TNGA-C ప్లాట్‌ఫారమ్ ఆధారంగా, ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్‌తో ప్రత్యేకంగా రూపొందించిన ఈ వాహనం 15 kmpl కంటే ఎక్కువ మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
(1 / 6)
టయోటా మోటార్ కరోలా క్రాస్ హైబ్రిడ్ SUVని గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఇది SUV వాహనాల్లో మొట్టమొదటి హైబ్రిడ్ మోడల్. 2023 టయోటా కరోలా క్రాస్ హైబ్రిడ్ వాహనం 3 స్పోర్ట్ వేరియంట్‌లు అలాగే 2 రెగ్యులర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అన్ని వేరియంట్‌లు 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఇంకా 2 ఎలక్ట్రిక్ మోటార్‌లతో కలిపి హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉంటాయి.
(2 / 6)
2023 టయోటా కరోలా క్రాస్ హైబ్రిడ్ గతంలో జపాన్‌లో లాంచ్ చేసిన వెర్షన్‌ను పోలి ఉంటుంది. ఇందులో స్పోర్ట్ వేరియంట్ మాత్రం పెద్ద స్లిమ్ గ్రిల్ కలిగి డిజైన్‌లో కొన్ని మార్పులు, సరికొత్త హెడ్‌లైట్‌లతో వస్తుంది. S వెర్షన్, SE వెర్షన్లలో 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, LED హెడ్‌లైట్లు, టెయిల్‌లైట్లు వంటి స్పెఫికేషన్లు ఉన్నాయి.
(3 / 6)
2023 టయోటా కరోలా క్రాస్ హైబ్రిడ్ XSE వేరియంట్ ఎక్స్‌టీరియర్లో అనేక మార్పులతో అందిస్తున్నారు. ఇందులో 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, LED హెడ్‌లైట్లు, టైల్‌లైట్లు, ఫాగ్ లైట్ల సెట్‌ను ఇచ్చారు.
(4 / 6)
2023 కరోలా క్రాస్ హైబ్రిడ్ వాహనం ఇంజన్ 194 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని టయోటా తెలిపింది. ఈ SUV కేవలం 8 సెకన్లలో సున్నా నుండి 100 kmph వరకు వేగం అందుకోగలదు. అలాగే 15.73 kmpl మైలేజీని కూడా అందిస్తుందని పేర్కొంది.
(5 / 6)
కరోలా క్రాస్ హైబ్రిడ్ SUV లోపలి భాగంలో 8-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఫాబ్రిక్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. SE వేరియంట్ కూడా బ్లైండ్ స్పాట్ స్క్రీన్, ప్యాడిల్ షిఫ్టర్‌లతో వస్తుంది. XSE వేరియంట్‌లో హీటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.
(6 / 6)
2023 కరోలా క్రాస్ హైబ్రిడ్ SUV లోపల ఇతర ఫీచర్లను పరిశీలిస్తే. టయోటా మల్టీమీడియా ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ Apple CarPlay, Android Auto, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్, బ్లూటూత్ కనెక్షన్ , హాట్‌స్పాట్ కనెక్షన్ WIFI ఉన్నాయి.
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు