ఐఎండీబీలో టాప్ రేటింగ్ ఉన్న బయోపిక్స్ ఇవే.. ఈ ఓటీటీల్లో చూడండి.. అన్నీ బ్లాక్‌బస్టర్సే-top imdb rated biopic movies ott streaming 12th fail ms dhoni untold story on prime video netflix jiohotstar ott ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఐఎండీబీలో టాప్ రేటింగ్ ఉన్న బయోపిక్స్ ఇవే.. ఈ ఓటీటీల్లో చూడండి.. అన్నీ బ్లాక్‌బస్టర్సే

ఐఎండీబీలో టాప్ రేటింగ్ ఉన్న బయోపిక్స్ ఇవే.. ఈ ఓటీటీల్లో చూడండి.. అన్నీ బ్లాక్‌బస్టర్సే

Published Jun 11, 2025 08:17 PM IST Hari Prasad S
Published Jun 11, 2025 08:17 PM IST

బయోపిక్ మూవీస్ కు ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. మరి వీటిలో మంచి ఐఎండీబీ రేటింగ్ ఉన్న సినిమాలేవో తెలుసా? అవి ప్రస్తుతం ఏయే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఉన్నాయో కూడా తెలుసుకోండి.

తప్పకుండా చూడాల్సిన బయోపిక్ సినిమాలు: వాస్తవ కథల ఆధారంగా రూపొందిన సినిమాలు చాలా సందర్భాల్లో అభిమానులను ఆకర్షిస్తాయి. బాలీవుడ్ లో యదార్థ సంఘటనలు, గొప్ప, విజయవంతమైన వ్యక్తుల జీవితాల ఆధారంగా ఎన్నో బయోపిక్ సినిమాలు వచ్చాయి. మీరు తప్పక చూడాల్సిన టాప్ 10 బయోపిక్ సినిమాల గురించి తెలుసుకోండి. ఈ సినిమాలు ఐఎండీబీలో అత్యధిక రేటింగ్స్ సాధించి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించాయి.

(1 / 12)

2018లో వచ్చిన 'ప్యాడ్ మ్యాన్' మూవీ ఓ బయోపిక్. అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ఆర్.బాల్కీ దర్శకత్వం వహించాడు. ప్రపంచవ్యాప్తంగా ప్యాడ్ మ్యాన్ గా ప్రసిద్ధి చెందిన అరుణాచలం మురుగణంతం కథ ఇది. ఐఎండీబీలో 7.9 రేటింగ్ ఉంది. బాక్సాఫీస్ దగ్గర రూ.200 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జీ5 ఓటీటీల్లో అందుబాటులో ఉంది.

(2 / 12)

పాట్నా గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సూపర్ 30 మూవీలో హృతిక్ రోషన్ ప్రధాన పాత్ర పోషించాడు. ఐఎండీబీలో ఈ సినిమాకు 7.9 రేటింగ్ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర రూ.115 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా జియోహాట్‌స్టార్ లో ఉంది.

(3 / 12)

ఎంఎస్ ధోనీ - ది అన్ టోల్డ్ స్టోరీ - భారత క్రికెట్ జట్టు స్టార్ వికెట్ కీపర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఐఎండీబీలో ఈ సినిమాకు 8.0 రేటింగ్ వచ్చింది. జియోహాట్‌స్టార్ లో మూవీని చూడొచ్చు.

(4 / 12)

మాంఝీ - ది మౌంటెన్ మ్యాన్ - తన భార్య మరణించిన తరువాత దశరథ్ మాంఝీ ఒంటరిగా ఒక పర్వతాన్ని తొలిచాడు. గ్రామం నుండి ఆసుపత్రికి వెళ్ళే రహదారిని అనేక కిలోమీటర్ల మేర ఒక్కడే రూపొందించాడు. స్ఫూర్తిదాయకమైన ఈ యథార్థ కథకు ఐఎండీబీలో 8.0 రేటింగ్ లభించింది. 2015లో వచ్చిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో ఉంది.

(5 / 12)

బ్రిటిష్ రాజ్ అణచివేత, బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన భగత్ సింగ్ కథను వివరించే ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ మూవీ 2002లో విడుదలైంది. ఐఎండీబీలో ఈ సినిమాకు 8.1 రేటింగ్ వచ్చింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

(6 / 12)

పాన్ సింగ్ తోమర్ - 2012లో విడుదలైన 'పాన్ సింగ్ తోమర్' చిత్రానికి ఐఎండీబీలో 8.2 రేటింగ్ వచ్చింది. చంబల్ తిరుగుబాటుదారుడు పాన్ సింగ్ యదార్థ కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

(7 / 12)

భాగ్ మిల్కా భాగ్ - దేశ విజయవంతమైన అథ్లెట్ మిల్కా సింగ్ కథను కళ్లకు కట్టే 'భాగ్ మిల్కా భాగ్' చిత్రానికి ఐఎండిబిలో 8.2 రేటింగ్ లభించింది. ఒక యదార్థ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. 2013లో వచ్చిన ఈ మూవీని ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

(8 / 12)

శ్రేయాస్ తల్పాడే లీడ్ రోల్లో నటించిన మూవీ 'కౌన్ ప్రవీణ్ తాంబే'. తన మొండితనం, అభిరుచితో తన కలలకు నెరవేర్చుకున్న ప్రవీణ్ తాండే అనే క్రికెటర్ కథ. ఐఎండీబీలో ఈ సినిమాకు 8.3 రేటింగ్ వచ్చింది. జియోహాట్‌స్టార్ ఓటీటీలో చూడొచ్చు.

(9 / 12)

సర్దార్ ఉధమ్ - ఈ సినిమాలో విక్కీ కౌశల్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఐఎండీబీలో ఈ సినిమాకు 8.3 రేటింగ్ వచ్చింది. ఈ మూవీని ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

(10 / 12)

సిద్ధార్థ్ మల్హోత్రా చిత్రం 'షేర్షా' ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. కెప్టెన్ విక్రమ్ బాత్రా కథతో తెరకెక్కిన ఈ సినిమాకు ఐఎండీబీలో 8.3 రేటింగ్ వచ్చింది. ఈ మూవీ కూడా ప్రైమ్ వీడియోలోనే అందుబాటులో ఉంది.

(11 / 12)

12th ఫెయిల్ - 2023 సంవత్సరంలో విడుదలైన '12th ఫెయిల్' చిత్రం ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. విక్రాంత్ మస్సే చిత్రానికి ఐఎండీబీలో 8.7 రేటింగ్ లభించింది. ఈ సినిమాను జియోహాట్‌స్టార్ లో చూడొచ్చు.

(12 / 12)

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు