Telangana Tourism : ప్రకృతి అందాలు చూసొద్దామా..! ఈ 4 టూరిస్ట్ స్పాట్లపై ఓ లుక్కేయండి-top five must visit tourist places in nizambad district details check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Telangana Tourism : ప్రకృతి అందాలు చూసొద్దామా..! ఈ 4 టూరిస్ట్ స్పాట్లపై ఓ లుక్కేయండి

Telangana Tourism : ప్రకృతి అందాలు చూసొద్దామా..! ఈ 4 టూరిస్ట్ స్పాట్లపై ఓ లుక్కేయండి

Nov 09, 2024, 10:17 AM IST Maheshwaram Mahendra Chary
Nov 09, 2024, 10:17 AM , IST

  • Nizambad Tourist Places : మంచు కురిసే వేళలో ప్రకృతిని ఆస్వాదించాలనుకుంటున్నారా..? అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను చూడాల్సిందే..! పేరు గాంచిన ప్రాజెక్టులు, అధ్యాత్మిక కేంద్రాలు, దట్టమైన అభయారణ్యం ఇలా ఒకటి కాదు అనేక టూరిస్ట్ స్పాట్ లను చూడొచ్చు.

ప్రకృతి అందాలు.. ఉల్లాసపరిచే ప్రాంతాలు..మరోవైపు నీటి జలాశాయాలు ఇలా ఒకటి కాదు ఎన్నో టూరిస్ట్ ప్లేసులకు నిజామాబాద్ జిల్లా కేరాఫ్ గా ఉంది. ఒక్కసారి నిజామాబాద్ టూర్ ప్లాన్ చేస్తే... అనేక పర్యాటక కేంద్రాలను కవర్ చేయవచ్చు. జిల్లాలో ఉన్న ప్రముఖ టూరిస్ట్ కేంద్రాలను వివరాలను ఇక్కడ చూడండి...  

(1 / 6)

డిచ్ పల్లి రామాలయం నిజామాబాద్ నుండి హైదరాబాద్ వెళ్ళే మార్గము లో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ ఆలయం 14 వ శతాబ్దంలో కాకతీయ రాజుల చేత నిర్మించబడింది, నిజామాబాద్ లోని పురాతన ఆలయంలో డిచ్పల్లి రామాలయం ఒకటి. అద్భుతైమ కళా నైపుణ్యాలను ఇక్కడ చూడొచ్చు. 

(2 / 6)

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజాంసాగర్ ప్రాజెక్టు ఉంటుంది. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తుంది.  నిజాం పాలనలో కట్టించినందుకు ఈ ప్రాజెక్టును నిజాంసాగర్‌గా నామకరణం చేశారు. హైదరాబాద్ నుంచి 145 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాజెక్టులో బోటింగ్‌ సౌకర్యం కూడా ఉంది. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయవచ్చు.  

(3 / 6)

అలీ సాగర్ రిజర్వాయర్ జాన్కంపపేట్ గ్రామంలో ఉంది. నిజామాబాద్ – బాసర్ రోడ్డు నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎడ్పల్లి మండల్ కేంద్రానికి సమీపంలో ఉంటుంది. నిజాం పాలనలో అభివృద్ధి చేశారు.  ఇక్కడ అద్భుతైమన ఉద్యానవనం ఉంటుంది. ఇది మొత్తం 33 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించింది, కొండల మధ్య ఓ ద్వీపం కూడా ఉంటుంది. అలీ సాగర్ లో జింకల పార్కు, ట్రెక్కింగ్ మరియు వాటర్ స్పోర్ట్స్ వంటి సౌకర్యాలు కలవు. పిక్నిక్ కు మంచి స్పాట్ గా అలీ సాగర్ ను చెప్పొచ్చు. 

(4 / 6)

ఎల్లారెడ్డి నియోజకపరిధిలోని  నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంటుంది.   దట్టమైన అభయారణ్యం, చుట్టూ నీరు,పైగా ఎటుచూసిన వన్యప్రాణుల సంచారం కనిపిస్తోంది. ఇక్కడ వర్షాకాలంలో వాటర్ ఫాల్స్ చూడొచ్చు.ఇక్కడ ఎక్కువగా జింకలు, లేళ్లు, నెమళ్లు కనిపిస్తాయి.

(5 / 6)

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పైన పేర్కొన్న టూరిస్ట్ కేంద్రాలే కాకుండా... దోమకొండ కోట, నవనాథ సిద్ధుల గుట్ట, అష్టముఖి కోనేరు, మల్లారం, బడాపహాడ్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులను చూడొచ్చు. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు