(1 / 7)
టాప్ 6 ఓటీటీ సినిమాలు: హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ ఇండియన్ సినిమాలు కూడా ఈవారం ఓటీటీ వీక్షకులను ఆకర్షిస్తున్నాయి. దేశవిదేశాల్లోని ఓటీటీ ప్రేక్షకులు దక్షిణాది సినిమాలను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మార్చి 23 నుంచి మార్చి 30 వరకు పలు సినిమాలు ఓటీటీలో విడుదల అయి, కొన్ని కానున్నాయి. ఈ వారం నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, జియోహోట్ స్టార్ వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలు అందుబాటులోకి వచ్చాయి. మరి వాటిలో చూడాల్సిన టాప్ 6 ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
(2 / 7)
అన్పోడు కన్మణి ఓటీటీ (మలయాళం): ఈ మలయాళ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఏడాది విడుదలైన అర్జున్ అశోకన్ మూడో చిత్రం ఇది. ఈ చిత్రంలో అనఘా నారాయణన్ కథానాయికగా నటించారు. మార్చి 26 నుంచి అన్పోడు కన్మణి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఫ్యామిలీ కామెడీ డ్రామా జోనర్‌లో వచ్చి మంచి సక్సెస్ అయింది.
(3 / 7)
మజాకా ఓటీటీ (తెలుగు): తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం మజాకా జీ5లో ఓటీటీ రిలీజ్ అయింది. మార్చి 28 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాలో సందీప్ కిషన్, రీతూవర్మ, రావు రమేష్, అన్షు ప్రధాన పాత్రల్లో నటించారు. త్రినాధ రావు దర్శకత్వం వహించారు. ఒకే కుటుంబానికి చెందిన మహిళలను ప్రేమించే తండ్రీకొడుకుల కథతో ఈ చిత్రం తెరకెక్కింది.
(4 / 7)
మిస్టర్ హౌస్ కీపింగ్ ఓటీటీ (తమిళం): తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రం మిస్టర్ హౌస్ కీపింగ్ ఆహా తమిళ్ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 25 ప్రసారం అవుతోన్న ఈ సినిమాలో హరి భాస్కర్, లోస్లియా మారిన్సన్ ప్రధాన పాత్రల్లో నటించారు. అరుణ్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇళవరసు, షరా, రాయన్ తదితరులు నటించారు.
(5 / 7)
అగత్యా ఓటీటీ (తెలుగు-తమిళం):
తెలుగు, తమిళ రెండు భాషల్లో విడుదలైన హారర్ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ అగత్యా. సన్ ఎన్‌ఎక్స్‌టీ ఓటీటీలో తమిళంలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాలో అర్జున్ సర్జా, జీవీ, రాశీ ఖన్నా నటించారు. అలాగే, అమెజాన్ ప్రైమ్‌లో తమిళం, తెలుగు భాషల్లో అగత్యా ఓటీటీ రిలీజ్ అయింది. ఈ సినిమాకు పా విజయ్ దర్శకత్వం వహించారు.
(6 / 7)
యూఐ ఓటీటీ (కన్నడ): ఉపేంద్ర నటించి, దర్శకత్వం వహించిన డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ యూఐ ఈ ఉగాది సందర్భంగా బుల్లితెరపై స్ట్రీమింగ్ కానుంది. అదే సమయంలో మార్చి 30న జీ5లో యూఐ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు. జీ కన్నడ ఛానెల్‌లో మార్చి 30న యూఐ ప్రసారం కానుంది.
(7 / 7)
తాయి కస్తూర్ గాంధీ ఓటీటీ (కన్నడ): బరగూరు రామచంద్రప్ప దర్శకత్వంలో జనమిత్ర మూవీస్ నిర్మించిన కన్నడ చిత్రం 'తాయి కస్తూర్ గాంధీ'. మార్చి 28 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో తాయి కస్తూర్ గాంధీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో కస్తూర్బాగా హరిప్రియ, గాంధీగా కిశోర్ నటించారు. ఈ చిత్రం బరగుర నవల ఆధారంగా రూపొందింది. 'తాయి కస్తూర్ గాంధీ' కస్తూర్బా గాంధీపై తీసిన మొదటి చిత్రం. కస్తూర్బా జీవితంలోని కొన్ని ముఖ్యమైన సంఘటనల ద్వారా చిత్రమిది.
ఇతర గ్యాలరీలు